AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం.. ఎక్కడ కనిపించిందంటే?

టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ ఐబ్లాక్ వద్ద చిరుత కదలికలను చూసిన స్థానికులు ఒక్కసారి భయంతో వణికిపోయారు. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్స్‌కు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి వచ్చే లోపే చిరుత అక్కడి నుంచి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం.. ఎక్కడ కనిపించిందంటే?
Tirupati Leopard Sighting
Raju M P R
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 8:35 PM

Share

టెంపుల్ సిటీ తరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఇటీవలే ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో చిరుత కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఈ ప్రాంతం శేషాచలం అటవి దగ్గరగా ఉండడంతో అక్కడ నివసిస్తున్న చిరుతలు, ఆహారం, దాహం తీర్చుకునేందుకని అప్పడప్పుడూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన చిరుతలు శేషాచలం కొండలకు ఆనుకొని ఉన్న ప్రాంత వాసులను తీవ్ర భయాందోళలనలకు గుర్తిచేస్తున్నాయి.

అయితే ఇటీవల ఎస్వీ యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ ఐ బ్లాక్, జి బ్లాక్ మధ్యలో చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వాళ్లు అక్కడికి చేరుకునే లోపే చిరుత అక్కడి నుంచి అడవిలోకి జారుకుంది. దీంతో సమస్య తీరిందని స్థానికులు ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి ఇండ్ల మధ్యలో చిరుత కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అటవీలోంచి మెళ్లగా ఇళ్ల మధ్యలోకి వచ్చిన చిరుత అక్కడ ఉన్న ఓ నీటి ట్యాంక్ వద్దకు వచ్చి నీరు తాగేందుకు ప్రయత్నించండి.. కానీ అవి అందకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది.

ఈ తతంగాన్నంత దూరంగా ఉండి గమనించిన స్థానికులు తమ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అయితే ఇలా తరచూ అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న నివాసాల చెంత చిరుతలు సంచరిస్తుండడంతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిరుతలు, వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు