ఏంటి బాస్ ఇది.! 33 సినిమాలు చేస్తే 25సినిమాలు ఫ్లాపులు.. అయినా రిస్క్ చేస్తున్న కుర్ర హీరో..
సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోలదే హవ. కొత్త కొత్త కథలతో, సినిమాలతో హిట్స్ అందుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు.

టాలీవుడ్ లో యంగ్ హీరోలకు కొదవే లేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కుర్ర హీరోలు. కొత్త కొత్త కంటెంట్ తో యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ సత్తా ఏంటో చూపిస్తున్నారు. కొందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం రీజనల్ ఫిలిమ్స్‌తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ కొంతమంది కుర్ర హీరోలు మాత్రం హిట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. సాలిడ్ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఈ హీరో ఒకడు. ఈ యంగ్ హీరోకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.. కానీ హిట్స్ మాత్రం లేవు.. సినిమాల్లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ.. 33 సినిమాలు చేస్తే 25సినిమాలు ఫ్లాపులు. ఎనిమిది సినిమాలే హిట్ అయ్యాయి.
ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్
అయినా కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు. ఈసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇంతకూ ఆహీరో ఎవరో కాదు టాలీవుడ్ కుర్ర హీరో నితిన్. జయం సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ ఆతర్వాత దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. కానీ నితిన్ ఖాతాలో హిట్స్ మాత్రం పడలేదు. అప్పట్లో నితిన్ వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే సినిమా చేశాడు.
అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..
ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇష్క్ తర్వాత, గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో మరో హిట్స్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఆ మధ్య వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా హిట్ అయ్యింది. ఆతర్వాత యధావిధిగా వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. రీసెంట్ డేస్ లో నితిన్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గం , రాబిన్ హుడ్ ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా తమ్ముడు సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇప్పటివరకు నితిన్ 33సినిమాలు చేస్తే అందులో 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఆయ్ సినిమా డైరెక్టర్ అంజితో నితిన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సంక్రాంతికి భారీ పోటీ ఉండనుంది. ఈ టైం లో సినిమా రిలీజ్ అంటే రిస్క్ అనే చెప్పాలి. కాగా ఈ సినిమాలో నితిన్ డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




