Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad : పిల్లలకు కొనిచ్చే చాక్లెట్స్‌తో ప్రాణాలకు పొంచివున్న ముప్పు..నగర శివారులో తయారవుతున్న నకిలీ ఉత్పత్తుల గుట్టురట్టు..

ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లేట్స్ తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. దుర్గంధంలోనే చాక్లెట్లు తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయోస్తుంది ఈ ముఠా. ళ్లిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేస్తున్నారు. గత కొంత కాలం నుండి మురుగునీటి ప్రవాహం ఎక్కువ కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Hyderabad : పిల్లలకు కొనిచ్చే చాక్లెట్స్‌తో ప్రాణాలకు పొంచివున్న ముప్పు..నగర శివారులో తయారవుతున్న నకిలీ ఉత్పత్తుల గుట్టురట్టు..
Fake Chocolates
Follow us
Ranjith Muppidi

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 08, 2023 | 11:18 AM

చాక్లెట్స్,లాలీపాప్స్ ను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చిన్న పిల్లలు. అవి ఎక్కడైనా కనిపిస్తే చాలు కొనేంతవరకు ప్రాణాలు తీస్తుంటారు. పిల్లలు చాలా మారం చేస్తున్నారు కదా అని ఇలాంటివి కొనిపెడితే..మీరు రిస్క్ తీసుకుంటునట్టే. అసలు చాక్లెట్స్, లాలిపాప్ తింటే ప్రాణాలు పోతాయని మీరు భయపడుతున్నారా..? అంటే అవును నిజమే అంటున్నారు నిపుణులు. నకిలీ తయారీ కేంద్రాల్లో చాక్లెట్స్ లాలీపాప్స్ లో ప్రమాదకరణమైన రసాయనాలు కలుపుతున్నారు. ఇవి తిన్న పిల్లల ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నారు కొందరు కేటుగాళ్ళు. ఆ చాక్లెట్స్ పిల్లలకు కొనిచ్చామంటే మనమే వాళ్లకు అనారోగ్యం కొనిపెట్టి వాళ్ళం అవుతాం. ఇక్కడ కాదుగా మనకెందుకులే అనుకుంటే పొరపాటే అవి ఎక్కడో తయారు చేయట్లేదు మన హైదరాబాద్ లోనే నకిలీ చాక్లెట్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

మీకు ఇష్టం మీ పిల్లలకు ఇష్టమని బ్రాండెడ్ చాక్లెట్స్ కొంటున్నారా… బ్రాండెడ్ చాక్లెట్స్ తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నారా…కానీ అలాంటి చాక్లెట్స్ jpce ఇప్పుడు మీ ప్రాణాల పాలిట విషంగా మారుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఓ నకిలీ బ్రాండెడ్ చాక్లెట్స్ తయారీ కేంద్రం గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ నకిలీ చాక్లెట్స్ లో హానికర కెమికల్స్‌ని వాడుతున్నట్టుగా గుర్తించారు. లీటర్ల కొద్ది కెమికల్స్, కలర్ ఎసెన్స్ లను స్వాధీనం చేసుకున్నారు. గ్లూకోస్ లిక్విడ్, సిట్రిక్ యాసిడ్ పౌడర్ ఆరెంజ్ లిక్విడ్ ఫ్లేవర్లతో పాటు స్వీట్ హై లాంటి కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారైన నకిలీ చాక్లెట్లను బేగంబజార్ హోల్సేల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు మార్కెట్లోని రిటైలర్స్ కు వీటిని విక్రయించడం ద్వారా సిటీలోని అన్ని చిన్న షాపులకు ఈ చాక్లెట్స్ ను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నకిలీ చాక్లెట్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లోని హైదర్ గూడ లో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా జరుగుతుంది. అనూస్ ఇమ్లీ, క్యాండీ జెల్లి పేరుతో చాక్లేట్స్ తయారీ చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లేట్స్ తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. దుర్గంధంలోనే చాక్లెట్లు తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయోస్తుంది ఈ ముఠా. ళ్లిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేస్తున్నారు. గత కొంత కాలం నుండి మురుగునీటి ప్రవాహం ఎక్కువ కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి కల్తీ చాక్లేట్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..