బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్.. సిద్ధిపేట సికందర్.. హరీష్ రావు రాజకీయ ప్రస్థానం ఇదే

Harish Rao Telangana Election 2023: తన్నీరు హరీష్ రావు.. సిద్ధిపేటలోని చింతమడకలో పుట్టి పెరిగిన ఈయన.. తన రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) నుంచి యువనేతగా ప్రారంభించారు. 2014-18 మధ్యకాలంలో తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్-శాసన వ్యవహారాల మంత్రిగా పని చేసిన హరీష్ రావు.. 2019 సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్.. సిద్ధిపేట సికందర్.. హరీష్ రావు రాజకీయ ప్రస్థానం ఇదే
Harish Rao
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 29, 2023 | 1:19 PM

Harish Rao Telangana Election 2023: తన్నీరు హరీష్ రావు.. సిద్ధిపేటలోని చింతమడకలో పుట్టి పెరిగిన ఈయన.. తన రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) నుంచి యువనేతగా ప్రారంభించారు. 2014-18 మధ్యకాలంలో తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్-శాసన వ్యవహారాల మంత్రిగా పని చేసిన హరీష్ రావు.. 2019 సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడిన అనంతరం.. ఆరోగ్యశాఖను కూడా హరీష్ రావునే చూసుకుంటున్నారు. 32 ఏళ్లకే తొలిసారిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన హ‌రీష్ రావు, అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలంగాణలో బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగడమే కాకుండా.. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు.. పిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు.

రాజకీయ జీవితం ఇలా..

హరీష్ రావు పుట్టి.. పెరిగింది సిద్ధిపేటలో.. డిగ్రీ విద్యను అభ్యసించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, సత్యనారాయణ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్ – ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో నుంచి యువనేతగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు హరీష్ రావు. అనంతరం 2004లో తొలిసారిగా సిద్ధిపేటలో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా 24,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే రెండోసారి ఇదే స్థానంలో మళ్లీ భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నుంచి పోటీ చేసిన హరీష్ రావు సమీప కాంగ్రెస్ అభ్యర్ధి బైరి అంజ‌య్యపై 64,677 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే 2010 ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో సిద్ధిపేట నుంచే మరోసారి బరిలోకి దిగి.. ఎమ్మెల్యేగా గెలుపొందటమే కాకుండా.. శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర సాగునీరు, మార్కెటింగ్ అండ్ శాస‌న‌సభ వ్యవ‌హ‌రాల శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు రికార్డు స్థాయిలో 1,20,650 ఓట్ల భారీ మెజార్టీతో నెగ్గి, వ‌రుస‌గా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. అతి చిన్న వయస్సులో ఈ ఫీట్ సాధించిన రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆరోగ్య, ఆర్ధిక శాఖలను చూసుకుంటున్న హరీష్ రావు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ప్రచార జోరు..

పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అక్టోబర్, నవంబర్ నెలల్లో విస్తృతంగా ప్రచారం చేశారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. ప్రజాఆశీర్వాద సభలు, రోడ్ షోలో పాల్గొని ఆయా జిల్లాల క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపారు. అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసే మేనిఫెస్టోను ప్రజల్లో తీసుకెళ్లారు. ఈ 60 రోజుల్లో సుమారు 80కి పైగా ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..