Kishan Reddy: ఎన్నికల బరిలో కిషన్ రెడ్డి లేకపోవడం వెనుక అసలు రహస్యం ఇదే.. ఆయన మాటల్లోనే.!

బీజేపీ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. తమ పార్టీ మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్ విత్ డ్రా అయ్యాక విడుదల చేస్తామన్నారు. ఇది బీజేపీకి అనాదిగా వస్తున్న సాంప్రదాయంగా చెప్పారు. జనసేన పొత్తు వల్ల బీజేవైఎం నుంచి వస్తున్న వ్యతిరేఖతపై స్పందించారు. ఎలాంటి వ్యతిరేఖత లేదని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉండకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Kishan Reddy: ఎన్నికల బరిలో కిషన్ రెడ్డి లేకపోవడం వెనుక అసలు రహస్యం ఇదే.. ఆయన మాటల్లోనే.!
Union Minister And Telangana BJP State President Kishan Reddy special interview With TV9
Follow us
Srikar T

|

Updated on: Nov 08, 2023 | 8:27 PM

బీజేపీ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. తమ పార్టీ మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్ విత్ డ్రా అయ్యాక విడుదల చేస్తామన్నారు. ఇది బీజేపీకి అనాదిగా వస్తున్న సాంప్రదాయంగా చెప్పారు. జనసేన పొత్తు వల్ల బీజేవైఎం నుంచి వస్తున్న వ్యతిరేఖతపై స్పందించారు. ఎలాంటి వ్యతిరేఖత లేదని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉండకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా బీజేపీ నేతలకు ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేవన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రగతి భవన్ డైనింగ్ టేబుల్ మీద జరుగుతాయని ఆరోపించారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఉద్రేక వ్యాఖ్యల పై స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై అధిష్టానానికి రాజాసింగ్ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. అందుకే అధిష్టానం ఆయనకు తిరిగి సీటు కేటాయించిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావిస్తూ ఈ దేశానికి అన్ని రకాలుగా నష్టం చేసిన పార్టీగా విమర్శించారు. అధిక ధరలు, అవినీతి అనేది ఎన్నికల ఎజెండాగా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని వివరించారు. బీఆర్ఎస్‌కు మొదటి మిత్రపక్షం మజ్లిస్ పార్టీ అయితే రెండో మిత్ర పక్షం కాంగ్రెస్ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నది అధిష్టానం నిర్ణయంగా చెప్పారు. భద్రాచలం సీతాశ్రీరామునికి సీఎం కేసీఆర్ మనుమడు ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలను ఇవ్వడాన్ని ఖండించారు. తెలంగాణలో ఒక నిశ్శబ్ధ విప్లవం ఉంది. బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. బీఆర్ఎస్ ఎన్ని పథకాలను ప్రకటించినా.. ఎంత డబ్బులు పంచినా గెలవదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మాఫియాలా వ్యవహరిస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ప్రకటించి ఘోరంగా విఫలమైందన్నారు. తామ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తప్పకుండా కేసీఆర్ అందించే సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..