KTR Profile: తండ్రికి తగ్గ తనయుడు.. డైనమిక్ లీడర్ కేటీఆర్ రాజకీయ ప్రస్థానం ఇది..
Minister KTR Telangana Election 2023: సీఎం కేసీఆర్ వారసుడిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. ప్రస్తుతం ఐటీ, వాణిజ్య, గనులు, ప్రజా వ్యవహారాలు, ప్రవాసుల శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్. అలాగే 2009 నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మంత్రి కేటీఆర్.

రాజకీయాల్లో సీఎం కేసీఆర్ వారసుడిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా, డైనమిక్ లీడర్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ, వాణిజ్య, గనులు, ప్రజా వ్యవహారాలు, ప్రవాసుల శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్. అలాగే 2009 నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మంత్రి కేటీఆర్. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. స్వతహాగా రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగిన కేటీఆర్.. తన గ్రాడ్యువేషన్ అనంతరం ఆయన చేస్తున్న ఐటీ ఉద్యోగానికి స్వస్తి పలికి.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన వెనుకే ఉంటూ.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. అలా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ ప్రజాదరణ ఉన్న మంత్రిగా.. ఎక్కడ సాయం కావాలంటే.. అక్కడ తాను ఉన్నానంటూ చేయూతనిచ్చే వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు.
తెలంగాణలోని సిద్ధిపేటలో జన్మించిన కేటీఆర్.. తన పాఠశాల విద్యను హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో పూర్తి చేశాడు. అనంతరం నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీ.. ఆ తర్వాత పూణేలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ, అనంతరం న్యూయార్క్‌లో ఎంబీఏ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ డిగ్రీలను అందుకున్నారు. ఐదేళ్ల పాటు ఐటీ ప్రొఫెషనల్‌గా ఉద్యోగం చేసిన కేటీఆర్.. 2006లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేశారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో చేరి క్రియాశీలక పాత్రను పోషించారు. అదే సంవత్సరం కేసీఆర్ తరపున ప్రచారంలో పాల్గొని.. ఆయన కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందటంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సిరిసిల్ల జనియోజకవర్గం నుంచి పోటీ చేసి.. గెలుపొందారు కేటీఆర్. ఆ తర్వాత 2014లోనూ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 53 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది.. పంచాయతీ రాజ్, ఐటీశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇంచార్జ్‌గా పని చేశారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే.
గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రచారం..
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంతో.. అలుపెరగని ప్రచారం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి.. ప్రచారం పూర్తయ్యే చివరి నిమిషం వరకు ఎలాంటి తీరిక లేకుండా.. ఈ 60 రోజుల్లో 30 బహిరంగ సభలు, 70 రోడ్ షోలు, 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించారు కేటీఆర్.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..
