Election Nominations: బుల్‌డోజర్లతో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ తమ గెలుపుకోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది. మరీ ముఖ్యంగా రాజకీయ సభలు, సమావేశాలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. ఇటు కేటీఆర్ అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరిపి కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇక నామినేషన్ల పర్వం జోరందుకుంది. నేడు మంచి రోజు కావడంతో నామినేషన్లతో బిజీబిజీగా గడిపారు నేతలు. ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ తమ గెలుపుకోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది. మరీ ముఖ్యంగా రాజకీయ సభలు, సమావేశాలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. ఇటు కేటీఆర్ అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరిపి కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇక నామినేషన్ల పర్వం జోరందుకుంది. నేడు మంచి రోజు కావడంతో నామినేషన్లతో బిజీబిజీగా గడిపారు నేతలు. ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటారు. కొందరు బైక్‌లపై నిర్వహిస్తే.. మరి కొందరు కార్లు, ఓపెన్ టాప్ వాహనాలపై అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. అయితే పటాన్‌చెరులోని బీజేపీ అభ్యర్థి వింతైన ప్రదర్శన చేపట్టి రికార్డుకెక్కారు. ఈ ర్యాలీతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు.
‘యాంగ్రీ హనుమాన్’ చిత్రంతో కూడిన కాషాయ జెండాలు, క్యూ కట్టిన బుల్ డోజర్లతో పటాన్‌చెరు రోడ్లను సందడిగా కనిపించాయి. దీంతో చాలా వాహనాలకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీజేపీ పటాన్‌చెరు అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తన నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో జేసీబీలతో ర్యాలీని నిర్వహించారు. దీనిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇలా వింత ర్యాలీలతో తన దృష్టిని ఆకర్షించడంలో సఫలమయ్యారు ఈ ఎమ్మెల్యే అభ్యర్థి. నవంబర్ 10తో అంటే ఇంకోక్కరోజులో నామినేషన్ ప్రక్రియకు గడువు ముగుస్తుంది. అందుకే నవంబర్ 9న మంచి ముహూర్తం ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల పోటీకి నామినేషన్ పత్రాలను సమర్పించడానికి బుల్డోజర్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ‘ఉగ్ర రూపంలో ఉండే హనుమాన్’ చిత్రంతో కూడిన కాషాయ జెండాలను వాహనాలకు కట్టి ఊరేగింపు నిర్వహించారు. దేశంలో బీజేపీ అధికారం చెలాయిస్తున్న రాష్ట్రాల్లో చేపట్టిన అన్ని రాజకీయ సభలు, సమావేశాల్లోకెల్లా ఈ బుల్డోజర్ ప్రదర్శనే వింతైనదిగా రికార్డ్‌కెక్కింది. పటాన్‌చెరు నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్‌ఎస్ బరిలోకి దించగా, అధికార పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేత నీలం మధు ముదిరాజ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. వీరిద్దరితో సమానంగా నందీశ్వర్ గౌడ్ నెట్టుకు రాగలరా లేదా అంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల తరువాత వచ్చే ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
Each one chooses his own style: @BJP4India candidate for #Patancheru #NandishwarGoud took a #BulldozerRally while going to file his nomination papers @BJP4Telangana @ndtv @ndtvindia #BJPbulldozerRally pic.twitter.com/Nac52DjSDS
— Uma Sudhir (@umasudhir) November 9, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..