Hyderabad: మహిళా పోలీస్ ఆఫీసర్స్‌కు ఎన్నికల్లో బిగ్ టాస్క్.. రౌడీ షీటర్లతో డీల్ చేసేందుకు నయా ప్లాన్..!
తెలంగాణలో అత్యధిక రౌడీషీటర్లు ఉండే ప్రాంతం హైదరాబాద్. ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున వారిని కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య కొత్త వ్యూహాన్ని రచించారు. మహిళ పోలీస్ అధికారులను రంగంలోకి దింపి ఇష్యూని సాఫ్ట్ గా డీల్ చేస్తున్నారు. సాధారణంగానే ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలో అత్యధిక రౌడీషీటర్లు ఉండే ప్రాంతం హైదరాబాద్. ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున వారిని కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య కొత్త వ్యూహాన్ని రచించారు. మహిళ పోలీస్ అధికారులను రంగంలోకి దింపి ఇష్యూని సాఫ్ట్ గా డీల్ చేస్తున్నారు. సాధారణంగానే ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. రాజకీయ నాయకులు సైతం రౌడీషీటర్ల అండదండలతో ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నికలకు రౌడీ షీటర్లు విఘాతం కలిగించే అవకాశం ఉండడంతో హైదరాబాద్ సీపీ శాండిల్య ఇప్పటి నుంచే దీనిపై ఫోకస్ పెట్టారు. దీంతో రౌడీషీటర్లను కట్టడి చేసేందుకు నయా ప్లాన్ తో సిద్ధమయ్యారు.
హైదరాబాదులో ఉన్న అన్ని జోన్లకు ఒక్క మహిళ అధికారిని కేటాయించారు హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య. మొత్తం 7 జోన్‌లలో మహిళా అధికారులు పర్యటిస్తున్నారు. సంబంధిత జోన్లలో ఉన్న రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి రౌడీషీటర్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని సాఫ్ట్ గా డీల్ చేయడం మహిళా అధికారులకు ఇచ్చిన స్పెషల్ టాస్క్. ఉదయం 7 నుండి 10 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు మహిళ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. మహిళ అధికారులతో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీసులు కూడా ఉంటారు. రౌడీ షీటర్లు తమ పనులను ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరుకునే బాధ్యత మహిళలదే అంటూ రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులకు పోలీసులు అల్టిమేట్ ఇస్తున్నారు. రౌడీషీటర్లు సాధారణంగానే కొంచెం నాటుగా వ్యవహరిస్తారు కాబట్టి మహిళ అధికారులను రంగంలోకి దించి వారి ఇళ్లల్లోని ఆడవారితో ఇష్యూని డీల్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని జోన్ లకు ఒక్కో మహిళా అధికారిని కేటాయించారు. రౌడీ షీటర్ లో ఎక్కువగా ఉండే సౌత్ జోన్ ప్రాంతానికి సిసిఎస్ డిసిపి శిల్పవల్లి, నార్త్ జోన్ కు డిసిపి చందనా దీప్తి, సెంట్రల్ జోన్ కు ఐసిసిసి డిసిపి పుష్ప, ఈస్ట్ జోన్ కు ఉమెన్ సేఫ్టీ ఏసిపి ప్రసన్నలక్ష్మి, వెస్ట్ జోన్ కు టీఎస్ న్యాబ్ ఎస్పీ సునీత రెడ్డి , సౌత్ వెస్ట్ కు టాస్క్ ఫోర్స్ డిసిపి నికిత పంత్, సౌత్ ఈస్ట్ జోన్ కు డిసిపి కవిత ను నియమించారు హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
