AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ర్యాలీలో రాళ్ల దాడి.. పలువురికి గాయాలు

తెలంగాణ ఎన్నికల్లో ప్రతి పార్టీ హోరా హోరిగా ప్రచారంలో పాల్గొంటోంది. పైగా ఎలక్షన్ నామినేషన్‌కి కూడా గడువు ముస్తోంది. ఈనెల 10న నామినేషన్ వేసేందుకు చివరి తేది కావడం, ఈరోజు మంచి ముహూర్తం ఉండటంతో ప్రతి ఒక్కరూ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందించేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు అభ్యర్థులు. తెలంగాణ వ్యాప్తంగా ఏ గల్లీ చూసినా రకరకాల పార్టీ కండువాలు కప్పుకున్న కార్యకర్తలే

Telangana Elections: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ర్యాలీలో రాళ్ల దాడి.. పలువురికి గాయాలు
Brs Vs Congress
Srikar T
|

Updated on: Nov 09, 2023 | 3:08 PM

Share

తెలంగాణ ఎన్నికల్లో ప్రతి పార్టీ హోరా హోరిగా ప్రచారంలో పాల్గొంటోంది. పైగా ఎలక్షన్ నామినేషన్‌కి కూడా గడువు ముస్తోంది. ఈనెల 10న నామినేషన్ వేసేందుకు చివరి తేది కావడం, ఈరోజు మంచి ముహూర్తం ఉండటంతో ప్రతి ఒక్కరూ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందించేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు అభ్యర్థులు. తెలంగాణ వ్యాప్తంగా ఏ గల్లీ చూసినా రకరకాల పార్టీ కండువాలు కప్పుకున్న కార్యకర్తలే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తమ జెండా కర్రలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. దీంతో అక్కడి వాతావరణం మొత్తం మరింత ఉద్రిక్తలకు కారణం అయింది. ఇరుపార్టీల ర్యాలీలు పరస్పరం ఎదురుపడటంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తరువాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. ఈ రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలకు, నేతలకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరస్పరం రువ్వుకున్న రాళ్లు వాహనాలపై పడటంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల్లో కూడా ఒకరిద్దరికి తలకు గాయమై రక్తస్రావం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..