AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills: మరింత రంజుగా జూబ్లి హిల్స్ రాజకీయం.. ఎన్నికల బరిలో నవీన్ యాదవ్

మజ్లిస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో .. ఇండిపెండెంట్‌గా జూబ్లిహిల్స్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు నవీన్ యాదవ్ ప్రకటించారు. దీంతో ఇక్కడ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఈయన 2014లో మజ్లిస్ తరుఫున పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి.. ఓటమి చెందారు. మరోసారి ఆయన తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు.

Jubilee Hills: మరింత రంజుగా జూబ్లి హిల్స్ రాజకీయం.. ఎన్నికల బరిలో నవీన్ యాదవ్
Naveen Yadav
Ram Naramaneni
|

Updated on: Nov 09, 2023 | 1:34 PM

Share

హైదారాబాద్‌లో జూబ్లిహిల్స్ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అనూహ్య రీతిలో భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దిన్ సీటు దక్కించుకున్నారు. దీంతో ఆ స్థానంపై గంపెడు ఆశలు పెట్టుకున్న పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారెక్కారు.  కాంగ్రెస్ ప్రధానంగా ముస్లిం ఓట్లపై ఫోకస్ పెట్టింది. అందుకే పలు సర్వేలు, వ్యూహరచనల అనంతరం అజారుద్దిన్‌కు సీటిచ్చింది. అటు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కూడా గట్టిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ను మజ్లిస్ ప్రకటించింది.  దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.

ఈ లోపల నవీన్ యాదవ్ రేస్‌లోకి వచ్చారు. చిన శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్‌ యాదవ్‌కు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో మంచి పట్టుంది. ఈయన కూడా ఈసారి ఇండిపెండింట్‌గా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. మజ్లిస్ టికెట్ ఆశించినప్పటికీ.. మరొకరికి సీటు ఇవ్వడంతో ఒంటరిగా బరిలోకి దిగనున్నారు.

2014 ఎన్నికలలో, నవీన్ కుమార్ మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 41,656 ఓట్లు సాధించారు. 2018 లో AIMIMకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఈసారి ఆయనకు 18,817 ఓట్లు పడ్డాయి. మరోసారి మజ్లిస్ టికెట్ ఆశించినా.. పార్టీ నిరాకరిచండంతో.. ఆయన ఇండింపెండెంట్‌గా ఎన్నికల బరిలో దిగతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గట్టి పోటీ ఇవ్వగలరు. “చాలా పార్టీలు కూడా పోటీ చేయమని నన్ను సంప్రదించాయి, కానీ నేను ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను” అని నవీన్ యాదవ్ తెలిపారు.  ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో ఎన్నికలకు ముందు జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. జూబ్లీ హిల్స్ హైదరాబాద్‌లోని సంపన్న సబర్బన్ ప్రాంతం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..