KTR: నామినేషన్ ర్యాలీలో కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జీవన్ రెడ్డి నామినేషన్ సందర్బంగా చేసిన ర్యాలీలో తప్పిన ప్రమాదం. ప్రచార వెహికిల్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వాహనం పైన ఏర్పాటు చేసిన రిలింగ్ పైనుండి తూలిపడ్డ కేటీఆర్, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జీవన్ రెడ్డి నామినేషన్ సందర్బంగా చేసిన ర్యాలీలో తప్పిన ప్రమాదం. ప్రచార వెహికిల్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వాహనం పైన ఏర్పాటు చేసిన రిలింగ్ పైనుండి తూలిపడ్డ కేటీఆర్, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ జీవన్ రెడ్డి నామినేషన్ యాత్రలో పాల్గొన్నారు. జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. చుట్టూ రద్దీ ఎక్కువ ఉండటంతో వారిని తప్పించబోయి డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వాహనం పైనున్న రైలింగ్ ఊడిపోవడంతో కిందపడిపోయారు. వాహనంపై నుంచి పూర్తిగా పడిపోయిన జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి. కేటీఆర్‌ను గన్‌మెన్ గట్టిగా పట్టుకోవడంతో నేలపై పడిపోకుండా ఆపగలిగారు. జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డిలకు స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
