BRS Party: కేసీఆర్ హెలికాఫ్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం.. అప్రమత్తమైన పైలట్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన పార్టీ ప్రచారంలో వేగం పెంచారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన చాపర్ టేకాఫ్ అయ్యేందుకు మెరాయిస్తోంది. దీనిపై అప్రమత్తమైన ఫైలట్ హెలికాఫ్టర్‌ను నిలిపివేశారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ తమ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత నెలలో ఎన్నికల
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన పార్టీ ప్రచారంలో వేగం పెంచారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన చాపర్ టేకాఫ్ అయ్యేందుకు మెరాయిస్తోంది. దీనిపై అప్రమత్తమైన ఫైలట్ హెలికాఫ్టర్‌ను నిలిపివేశారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ తమ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత నెలలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో బిజీ అయ్యారు. ప్రతి రోజూ మూడు సభలు ఉండేలా ప్రణాళికలు రచించారు. ఇక సభలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ఉపయోగిస్తున్నారు.
సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతికలోపం తలెత్తింది. దీంతో చాపర్‌ను నిలిపివేశారు పైలట్. మామూలుగా అయితే సిర్ఫూర్‌లో కేసీఆర్ హెలికాఫ్టర్ టేకాఫ్ కావాల్సి ఉంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డు మార్గం గుండా ఆసిఫాబాద్ బయలుదేరారు కేసీఆర్. ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా కేసీఆర్ చాపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం నాడు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్‌లో బయలుదేరారు కేసీఆర్. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..