AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fried Rice Syndrome: ఫ్రైడ్ రైస్ తిని వ్యక్తి మృతి.. కారణం అదే అంటోన్న వైద్యులు

సాధారణంగా ఓసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆహారం కలుషితం అయ్యి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఇటువంటి ఆహారాన్ని తింటే లేనిపోని రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వండిన ఆహారాన్ని ఫ్రైడ్ రైస్‌ తయారు చేసి, దానిని మళ్లీ వేడి చేసి తినడం వల్ల ఓ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి మరణానికి 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' కారణమని..

Fried Rice Syndrome: ఫ్రైడ్ రైస్ తిని వ్యక్తి మృతి.. కారణం అదే అంటోన్న వైద్యులు
Fried Rice Syndrome
Srilakshmi C
|

Updated on: Nov 07, 2023 | 3:39 PM

Share

న్యూఢిల్లీ, నవంబర్‌ 7: సాధారణంగా ఓసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆహారం కలుషితం అయ్యి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఇటువంటి ఆహారాన్ని తింటే లేనిపోని రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వండిన ఆహారాన్ని ఫ్రైడ్ రైస్‌ తయారు చేసి, దానిని మళ్లీ వేడి చేసి తినడం వల్ల ఓ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి మరణానికి ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ కారణమని తేలడంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఎవరికి వస్తుంది? ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి వంటి వివరాలు తెలుసుకుందాం..

ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది మొదటిసారిగా 2008లో వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల ఓ కాలేజీ యువకుడు నూడుల్స్‌ ప్రిపేర్ చేసి తిన్నాడు. మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 5 రోజుల తర్వాత మళ్లీ వేడి చేసి తిన్నాడు. దీంతో అది పాయిజన్ అయ్యి చివరికి అతని ప్రాణాలను తీసింది.

ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే..?

అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం.. ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అనేది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. బాసిల్లస్ సెరియస్ అనే బాక్టీరియం ద్వారా ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా కలుషితమైన పదార్థాన్ని తింటే వాంతులు, డయేరియా వంటి జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతుంది. అయితే చాలా అరుదుగా మాత్రమే మరణం సంభవిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యాక్టీరియా ప్రతి ఆహారంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వండిన ఆహారం, సరైన పద్ధతిలో నిల్వ చేయని కొన్ని ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది. బియ్యం, పాస్తా వంటి పిండి పదార్థాలు ఎక్కువ సమయం నిల్వ ఉంచితే చెడిపోయే అవకాశం ఉంది. వండిన కూరగాయలు, మాంసం వంటకాలు వంటి ఇతర ఆహారాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఇందులోని బ్యాక్టీరియా రెండు రకాల ట్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. హీట్‌ యాసిడ్ లేబుల్ ఎంట్రోటాక్సిన్, హీట్‌-నిరోధక ఎమెటిక్ టాక్సిన్‌లను విడుదల చేస్తుంది. ఫుడ్‌ను వేడి చేయడం వల్ల అవి విషతుల్య రసాయనాలను విడుదల చేస్తాయి.

ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ లక్షణాలు..

బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా ఉన్న వాంతులు, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి 12 గంటల కంటే తక్కువగా ఉండవచ్చు. సాధారణంగా ఈ లక్షణాలు 24 గంటల తర్వాత తగ్గుముఖం పడతాయి.

మరిన్ని జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.