Assembly Polls: 50 ఏళ్లలో 20సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడాడు.. అయినా మళ్లీ పోటీ చేస్తానంటూ
అతనో పట్టువదలని విక్రమార్కుడు. గత 50 ఏళ్ల నుంచి అతను ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా ఎక్కడా గెలవలేదు. ఇప్పటి వరకు దాదాపు 20 ఎన్నికల్లో పోటీ చేసి అన్నింటిలోనూ ఓటమి పాలయ్యాడు. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మారోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు ఈ 78 ఏళ్ల ముదుసలి. అతరి కథేంటో మీరూ తెలుసుకోండి..

జైపూర్, నవంబర్ 7: అతనో పట్టువదలని విక్రమార్కుడు. గత 50 ఏళ్ల నుంచి అతను ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా ఎక్కడా గెలవలేదు. ఇప్పటి వరకు దాదాపు 20 ఎన్నికల్లో పోటీ చేసి అన్నింటిలోనూ ఓటమి పాలయ్యాడు. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మారోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు ఈ 78 ఏళ్ల ముదుసలి. అతరి కథేంటో మీరూ తెలుసుకోండి..
రాజస్థాన్‌కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ అనే వ్యక్తి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దళిత వర్గానికి చెందిన తీతర్ సింగ్ 1970 నుంచి ఆ రాష్ట్రంలో జరిగిన రకరకాల ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈ నెలలో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి పోటీ చేసేందుకు రెడీ అయిపోయాడు. నేను ఎందుక పోరాటం చేయకూడదంటూ ప్రశ్నిస్తున్నాడు.
కూలిగా జీవితాన్ని కొనసాగిస్తున్న తీతర్‌సింగ్ కరన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ఎందుకు పోటీచేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు.. నేను ఎందుకు పోటీచెయ్యకూడదంటూ ఎదురు ప్రశ్నవేశాడు. ఇలా గడిచిన 50 ఏళ్ల నుంచి అతను పంచాయతీ ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు పోటీ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తమకు భూములు ఇవ్వాలని, సదుపాయాలను కల్పించాలని తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటమని ఆయన అన్నారు. మన్రేగాలో లేబర్‌గా పని చేస్తున్న ఆ వృద్ధుడు పాపులారిటీ కోసమో, రికార్డుల కోసమో తాను పోటీ చేయడం లేదన్నాడు. తమ హక్కులను సాధించేందుకు ఓటును ఆయుధంగా వాడుతేన్నట్లు తెలిపాడు.
1970 దశకలో కెనాల్ కమాండ్ ఏరియాలో తనకు భూమి ఇవ్వలేదని, తనలాంటి వాళ్లు చాలా మంది భూముల్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అప్పటి నుంచి తాను పంచాయితీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు పోటీచేశానని, అయితే ప్రతిసారి ఓటమి పాలయ్యానని చెప్పుకొచ్చాడు. అదే ఉత్సాహంతో మరోమారు పోటీ చేస్తానని తీతర్ సింగ్ తెలిపాడు. ఈ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానని ఆయన తెలిపారు.
తనకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారని.. మనవళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయని ఆయన తెలిపారు. తన వద్ద డిపాజిట్ అమౌంట్ రూ.2,500 నగదు ఉందని, అయితే భూమి, ఆస్తి, వాహనాలు లేవని తెలిపారు. కాగా తీతర్ సింగ్ 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు సాధించారు.
మరిన్ని జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.