AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rat Glue Pad: ఎలుకల నివారణకు వాడే గ్లూ పేపర్‌ బోర్డులపై నిషేధం.. కారణం ఇదే!

ఎలుకలను ట్రాప్ చేసే గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటనలో పంజాబ్‌లో ఇకపై తయారీ, అమ్మకం, వినియోగం నిషేధం అమలుకానుంది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు హర్యానా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ..

Rat Glue Pad: ఎలుకల నివారణకు వాడే గ్లూ పేపర్‌ బోర్డులపై నిషేధం.. కారణం ఇదే!
Rat Glue Pad
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 07, 2023 | 5:23 PM

జైపూర్, నవంబర్‌ 7: ఎలుకలను ట్రాప్ చేసే గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటనలో పంజాబ్‌లో ఇకపై తయారీ, అమ్మకం, వినియోగం నిషేధం అమలుకానుంది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు హర్యానా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ డైరెక్టర్ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎలుకలను పట్టుకోవడానికి ఉచ్చుల్లా వీటిని వినియోగిస్తారు. ఎలుకల నివారణకు ఉపయోగించే గ్లూ పేపర్ బోర్డు ఒక ప్రత్యేకమైన బోర్డు. దానిపై గట్టిగా ఉండే మొండి జిగురు ఉంటుంది. దీనిపై అంటుకున్న ఓ జీవి లేదా వస్తువైనా గట్టిగా అంటుకుపోతుంది. ఎలుకలు ఎక్కువగా ఉండే ఇళ్లలో వీటిని ఉంచడం ద్వారా ఎలువలు వచ్చి దీనిపై ఇరుక్కుపోతాయి. ఆ తర్వాత దానిని తీసుకెళ్లి ఇంటికి దూరంగా పారవేస్తారు. అయితే వీటిని వినియోగించడం ప్రాణులను హింసించడమేనంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) పేర్కొంది. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం1960లోని సెక్షన్ 11ని ఎత్తి చూపింది. దీంతో ఈ సంస్థ సూచనల మేరకు పేపర్ బోర్డును నిషేధించిన 17వ రాష్ట్రంగా పంజాబ్ అవతరించింది. జంతువులను హింసించడం ఈ చట్టం కింద నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బ్లూ పేపర్‌ బోర్డును నిషేధించారు.

PETA ఇండియా అడ్వకేసీ ఆఫీసర్ ఫర్హత్ ఉల్ ఐన్ మాట్లాడుతూ.. జంతువులు ఎంత చిన్నవైనా సరే వాటిని రక్షించడంలో చట్టానికి కట్టుబడి ఉండాలి. బ్లూ పేపర్‌ బోర్డులను దీర్ఘకాలంపాటు వినియోగించడానికి పనికిరావు. సాధారణంగా బలమైన జిగురుతో కప్పబడిన ప్లాస్టిక్ ట్రేలు లేదా కార్డ్‌బోర్డ్ షీట్‌లతో తయారు చేస్తారు. ఎలుకలు జిగురుకు అంటుకుపోయి బయటపడలేక ఆకలితో అలమటించి చనిపోతాయి. ఒక్కోసారి ఈ ఉచ్చులలో చిక్కుకున్న ఎలుకలు వాటి ముక్కులు, నోరు జిగురులో కూరుకుపోయి ఊపిరాడక చనిపోవడం, తప్పించుకోవడం కోసం కొన్ని ఎలుకలు వాటి కాళ్లను అవే కొరుక్కోవడం వల్ల రక్తస్రావంతో చనిపోవడం, మరి కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి బోర్డుకు అతుక్కుపోయి ఆకలితో చనిపోవడం జరుగుతుంది. ఈ బోర్డుల వల్ల ఎలుకలు బాధాకరమైన మరణాన్ని అనుభవిస్తున్నాయి. ఇది దుర్మార్గమైన హత్యతో సమానం. అందువల్లనే దీనిని నిషేధించాలని పెటా ఇండియా డిమండ్‌ చేస్తోంది. ఈ మేరకు AWBI ఆదేశాలను అమలు చేయడానికి హర్యానా రాష్ట్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని PETA ఇండియా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిషేధం అమలుఅవుతోంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లతోపాటు తాజాగా 27వ రాష్ట్రంగా హర్యాణా చేరింది. ఎలుకల జనాభాను నియంత్రించడానికి ఉత్తమ మార్గాలను కూడా సూచించింది. చెత్త డబ్బాలను మూసివేయడం, అమ్మోనియాతో నానబెట్టిన కాటన్‌ను ఉపయోగించడం, ఎలుకల బోనులు వినియోగించడం వంటి వాటి ద్వారా ఎలుకల సమస్యను పారదోలవచ్చని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా