గనుల శాఖ అధికారిణి ప్రతిమ మృతి కేసులో అనుమానాలు
కర్ణాటకలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ హత్య ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఆమె శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఆమె తోటి సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఆమె డైనమిక్ లేడీ అన్నారు. సోదాలపరంగా, నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారనీ తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నారనీ అన్నారు. తాజాగా కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారనీ ఆమెకు శత్రువులు ఎవరూ లేరని తెలిపారు.
కర్ణాటకలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ హత్య ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఆమె శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఆమె తోటి సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఆమె డైనమిక్ లేడీ అన్నారు. సోదాలపరంగా, నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారనీ తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నారనీ అన్నారు. తాజాగా కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారనీ ఆమెకు శత్రువులు ఎవరూ లేరని తెలిపారు. దీంతో తాజాగా ఆమె జరిపిన తనిఖీలే ప్రతిమ హత్యకు కారణమయ్యాయా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేఎస్ ప్రతిమ బదిలీపై ఇటీవలే బెంగళూరుకు వచ్చారు. డ్యూటీ ముగించుకుని దొడ్డకల్లసంద్ర అపార్ట్‌మెంట్‌కు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు ఊపిరి ఆడకుండా చేసిన నిందితుడు, గొంతుకోసి హత్య చేశాడని గుర్తించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కేసుపై దర్యాప్తునకు ఆదేశించారు. కాగా.. ప్రతిమ కేసులో తొలి అనుమానుతుడిని అరెస్టు చేశారు. అతడు ఒక డ్రైవర్. ఇటీవలే అతడిని ప్రతిమ పని నుంచి తొలగించారని తెలిసిందని బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు. తనను పని నుంచి తొలగించడం వల్లే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nepal Earthquake: నిలువ నీడలేదు.. ఇంకా భయం పోలేదు !!
Keerthy Suresh: అన్ బిలీవబుల్.. డ్రైవింగ్ చితక్కొట్టేసిన సావిత్రి
Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు
Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్ మసాలా సాంగ్
Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

