Nepal Earthquake: నిలువ నీడలేదు.. ఇంకా భయం పోలేదు !!

Nepal Earthquake: నిలువ నీడలేదు.. ఇంకా భయం పోలేదు !!

Phani CH

|

Updated on: Nov 07, 2023 | 7:02 PM

భారీ భూకంపం బారిన పడ్డ నేపాల్‌లో తలదాచుకునే చోటైనా లేక కొన్ని వేలమంది ప్రజలు ఆరుబయటే ఉంటున్నారు. సహాయక శిబిరాల ఏర్పాటుకు సరిపడినన్ని టెంట్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రాత్రుళ్లు చలిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కళ్లముందు జరిగిన విలయాన్ని తలుచుకుని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. బీటలు వారిన ఇళ్లలోకి అడుగుపెట్టేందుకు వారు సాహసించలేకపోతున్నారు.

భారీ భూకంపం బారిన పడ్డ నేపాల్‌లో తలదాచుకునే చోటైనా లేక కొన్ని వేలమంది ప్రజలు ఆరుబయటే ఉంటున్నారు. సహాయక శిబిరాల ఏర్పాటుకు సరిపడినన్ని టెంట్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రాత్రుళ్లు చలిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కళ్లముందు జరిగిన విలయాన్ని తలుచుకుని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. బీటలు వారిన ఇళ్లలోకి అడుగుపెట్టేందుకు వారు సాహసించలేకపోతున్నారు. ఖట్మాండులో ఇంకా చిన్నాపెద్దా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన 157 మందిలో 120 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పశ్చిమ నేపాల్‌లోని పర్వత ప్రాంతాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారినా సహాయక బృందాలు ఆదివారం ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేశాయి. తీవ్రంగా దెబ్బతిన్న రెండు జిల్లాలకు నాలుగువేల మంది సైనికుల్ని, సాయుధ పోలీసు దళాలను పంపించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు తొలి 72 గంటలు కీలకం కావడంతో దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సైనిక ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ కృష్ణభండారి తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: అన్ బిలీవబుల్.. డ్రైవింగ్‌ చితక్కొట్టేసిన సావిత్రి

Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు

Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్‌ మసాలా సాంగ్

Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్‌..

Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్‌ ఎమోషనల్ పోస్ట్