ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం

ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం

Phani CH

|

Updated on: Nov 06, 2023 | 9:30 PM

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికా తన శక్తిమంతమైన ఆయుధ వనరులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒహయో శ్రేణి అణు జలాంతర్గామిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ట్విటర్‌లో ప్రకటించింది. ఈ జలాంతర్గామిలో కనీసం 154 టోమహాక్‌ క్షిపణులు ఉంటాయి.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికా తన శక్తిమంతమైన ఆయుధ వనరులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒహయో శ్రేణి అణు జలాంతర్గామిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ట్విటర్‌లో ప్రకటించింది. ఈ జలాంతర్గామిలో కనీసం 154 టోమహాక్‌ క్షిపణులు ఉంటాయి. ఒక గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌లో ఉండే వాటి కంటే ఇవి 50 అదనం అన్నమాట. దాదాపు 1000 కిలోల వార్‌హెడ్‌తో ఈ క్షిపణులు దాడి చేయగలవు. 2011లో ఆపరేషన్‌ ఒడెస్సా డాన్‌లో భాగంగా యూఎస్‌ఎస్‌ ఫ్లోరిడా జలాంతర్గామి దాదాపు 100 టోమహాక్‌ క్షిపణులను లిబియాపై ప్రయోగించింది. సాధారణంగా బాలిస్టిక్‌ మిసైల్‌, గైడెడ్‌ మిసైల్‌ సబ్‌మెరైన్ల కదలికలను అమెరికా సైన్యం అత్యంత అరుదుగా మాత్రమే బహిర్గతం చేస్తుంది. తాజాగా సబ్‌మెరైన్‌ ఫొటోతో సహా సెంట్రల్‌కమాండ్‌ ట్విటర్‌లో పోస్టు చేయడం గమనార్హం. ఇక ఇప్పటికే రెండు అమెరికా విమాన వాహక నౌకలను ఈ ప్రాంతంలో మోహరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్‌ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్‌

TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్