మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అని చితక్కొట్టిన అత్తమామలు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
భర్త విదేశాల్లో ఉండగా, అతని ఇంట్లోకి రహస్యంగా ఓ వ్యక్తి వచ్చి నేరుగా భార్య గదిలోకి వెళ్లాడు. అయితే ఆ సమయంలో భార్య నోటి నుండి వచ్చిన ఒక్క మాట అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామం మరింత ఆశ్చర్యకరం. యూపీలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ప్రియుడిని వివాహిత మంచం కింద దాచిపెట్టగా.. కుటుంబసభ్యులు దొంగ అనుకుని చితకబాదారు. ఈ సంఘటన పురకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీమ్ భాభాంగావా గ్రామంలో జరిగింది. అలీమ్ భాభాంగావా గ్రామంలో నివసించే రకీబుల్నిషా భర్త జాఫర్ అలీ ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో పనిచేస్తున్నారు. వారికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. డిసెంబర్ 6న అర్థరాత్రి రకీబుల్నిషా ప్రియుడు అలీమ్ ఆమెను కలవడానికి రహస్యంగా ఇంట్లోకి వచ్చాడు. వారిద్దరూ గదిలో నిశ్శబ్దంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఆ శబ్దాలు విన్న అత్తమామలకు ఇంట్లోకి దొంగ వచ్చాడనే అనుమానం వచ్చింది. వెంటనే వారు గట్టిగా దొంగ.. దొంగ అని అరవడం ప్రారంభించారు. ఈ శబ్దం విని చుట్టుపక్కల జనం కూడా గుమిగూడారు.
మంచం కింద ప్రియుడు పట్టివేత
కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో భయపడిన రకీబుల్నిషా, తన ప్రియుడు అలీమ్‌ను హడావిడిగా మంచం కింద దాచిపెట్టి గది తలుపు తెరిచింది. కుటుంబ సభ్యులు గదిలో వెతకడం ప్రారంభించారు. మంచంపై ఉన్న పరుపు కింద పడి ఉండటంపై వారికి అనుమానం వచ్చింది. ఒకరు అనుకోకుండా మంచాన్ని చూడగా లోపల బట్టల కట్టల మధ్య దాక్కుని ఉన్న అలీమ్ కనిపించాడు. దొంగ అనుకుని కుటుంబసభ్యులు అతన్ని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. ప్రజలు అలీమ్‌ను కొడుతుండగా చూసిన రకీబుల్నిషా వారిని ఆపడానికి వేడుకుంటూ బిగ్గరగా “దయచేసి, అతన్ని కొట్టకండి. అతను నా ప్రియుడు.. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పింది. ఈ మాట విన్న వెంటనే అందరూ షాకై కొట్టడం ఆపేశారు. ఈ సంఘటన తర్వాత రకీబుల్నిషా మామ షమీమ్ షా పురకలందర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
భర్త అంగీకారంతోనే పెళ్లి
పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, రకీబుల్నిషా – అలీమ్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నట్లు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న మామ షమీమ్ షా, దుబాయ్‌లో ఉన్న తన కొడుకు జాఫర్ అలీకి వీడియో కాల్ చేసి జరిగినదంతా చెప్పాడు. అందుకు జాఫర్ అలీ స్పందిస్తూ.. నా భార్య వేరొకరితో సంతోషంగా ఉంటే నాకు ఓకే. ఆమెను వివాహం చేసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమె సంతోషంగా ఉంటే చాలు” అని తెలిపాడు. భర్త అంగీకారంతో మామ షమీమ్ షా స్వయంగా రకీబుల్నిషా – అలీమ్‌ల వివాహాన్ని పోలీస్ స్టేషన్‌లోనే జరిపించారు. వివాహం సమయంలో జాఫర్ అలీ వీడియో కాల్ ద్వారా అభినందనలు తెలిపాడు. రకీబుల్నిషా తండ్రి చాంద్ అలీతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లిని అంగీకరించి నూతన దంపతులను ఆశీర్వదించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




