- Telugu News Photo Gallery Stop keeping these 5 foods in the fridge, nutritionist reveals why tomatoes, flour and juice go bad in the fridge
ఫ్రిజ్‌లో పొరపాటున కూడా ఈ 5 ఆహారాలు పెట్టొద్దు.. పెడితే విషమే.. లైట్ తీసుకోవద్దు..
ఈ ఆధునిక కాలంలో అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్‌లు కామన్‌గా మారాయి. మిగిలిపోయిన ఫుడ్ మొత్తం ఫ్రిజ్‌లోనే ఉంటుంది. ఆహారం చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలని ఫ్రిజ్‌లు పెడుతుంటారు. అయితే తెలియకుండానే కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలు తగ్గిపోయి, అవి మన ఆరోగ్యానికి హానికరం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాహార నిపుణురాలు సిమ్రత్ కతురియా ప్రకారం.. ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని 5 ముఖ్యమైన వస్తువుల గురించి వివరించారు.
Updated on: Dec 08, 2025 | 8:10 AM

టమాటాలు: 99 శాతం మంది టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ ఇది వాటిలోని ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్‌ను, రుచిని తొలగిస్తుంది. లైకోపీన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద, సూర్యరశ్మి తగలకుండా ఉంచడం ఉత్తమం.

మిగిలిపోయిన పండ్ల రసం: మిగిలిన పండ్ల రసాన్ని ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడం ఆరోగ్యానికి హానికరం. దాని తాజాదనం, పోషకాలు తగ్గుతాయి. రసాన్ని ఎల్లప్పుడూ తాజాగా తాగాలి. ఒకవేళ నిల్వ చేయాల్సి వస్తే ఫ్రిజ్‌లో కాకుండా ఫ్రీజర్‌లో ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఈ పేస్ట్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువై, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. తక్కువ మొత్తంలో తయారు చేసుకుని వాడటం లేదా ఫ్రీజర్‌లో సరైన పద్ధతిలో నిల్వ చేయడం మంచిది.

మిగిలిపోయిన పిండి: రోట్టెలు చేసిన తర్వాత పిండిని ఫ్రిజ్‌లో ఉంచడం చాలా మంది చేసే పెద్ద తప్పు. ఇలా ఉంచిన పిండి త్వరగా పులియడం మొదలుపెడుతుంది. ఈ పిండితో చేసిన రోటీలు తినడం వల్ల గ్యాస్, ఉబ్బసం సమస్యలు పెరుగుతాయి. పిండిని వెంటనే వాడేయాలి లేదా తాజా పిండితో రోటీలు చేసుకోవాలి.

ముక్కలు చేసిన నిమ్మకాయ: నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు అవి త్వరగా ఆక్సీకరణం చెందడం ప్రారంభిస్తాయి. ఎక్కువ ముక్కలు ఉంటే వాటి నుండి రసం తీసి ఐస్ ట్రేలో నిల్వ చేసుకోవడం ఉత్తమం.




