Viral Video: నా పెళ్లికే నేనే వెళ్లలేకపోతున్నా.. ఎయిర్ పోర్టుల్లో ప్రజల కన్నీటి కష్టాలు.. వీడియో వైరల్..
ఇండిగో విమానాల రద్దు వేలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పెళ్లి పనుల మీద వెళ్లే వధూవరుల కష్టాలు చెప్పలేనివి. కొందరు వీడియో కాల్ ద్వారా రిసెప్షన్లకు హాజరయ్యారు. అయితే తన పెళ్లికి తానే వెళ్లలేకపోతున్నానంటూ ఓ వరుడి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ అనూహ్య అంతరాయం వల్ల పెళ్లి పనుల మీద వెళ్లాల్సిన వధూవరులు వారి కుటుంబాలు అనుకోని కష్టాల్లో చిక్కుకున్నారు. ఒక జంట వీడియో కాల్ ద్వారా తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కాగా మరికొందరు వేడుకలను రద్దు చేసుకునేందుకు లేదా తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు పరుగులు తీశారు. ఒక కుటుంబం అయితే అత్యవసరంగా వెళ్లడానికి ఖరీదైన చార్టర్ ఫ్లైట్‌ను బుక్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది.
నా పెళ్లికే నేను వెళ్లలేకపోతున్నా
ఈ గందరగోళం మధ్య ఒక వైరల్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆలస్యంతో ఒత్తిడికి గురైన తోటి ప్రయాణీకులతో మాట్లాడిన ఓ వరుడు తన బాధను వ్యక్తపరుస్తూ వివాహ ఆహ్వాన పత్రికను చూపించాడు. ఎయిర్‌లైన్ గందరగోళం కారణంగా తాను తన వివాహానికే హాజరు కాలేకపోతున్నానని వాపోయాడు. NewsAlgebraIND అనే ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది. నవ్వు వెనక ఎంతో బాధ ఉంది. నా పెళ్లికి నేనే వెళ్లలేకపోతున్నాను.. నేను ఏం చేయాలి అని క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
ఇండిగో వైఖరిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక నెటిజన్.. ‘‘ఇలాంటివి ఏదైనా పాశ్చాత్య లేదా యూరోపియన్ దేశాలలో జరిగి ఉంటే ఆ విమానయాన సంస్థ వినియోగదారులకు లక్షలాది డాలర్ల పరిహారం చెల్లించేది. కానీ మన దేశంలో ఇండిగోకు ఉచిత పాస్ లభిస్తుంది’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో యూజర్ అతను త్వరగా వివాహం చేసుకోవాలని, అతని సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కారమవ్వాలని ఆకాంక్షించాడు.
ధరల నియంత్రణకు కేంద్రం ఆదేశం
మరోవైపు ప్రయాణికుల ఇబ్బందులు తీవ్రం కావడంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. టిక్కెట్ ధరలు అమాంతం పెరగడంతో, విమానయాన సంస్థలు నిర్దేశించిన ఛార్జీల పరిమితులను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఆదేశం లక్ష్యం ధరల క్రమశిక్షణ పాటించేలా చూసినప్పటికీ, చాలా మంది ప్రయాణీకులు టిక్కెట్ ధరలు చూసి ఆశ్చర్యపోయారు.
Pain behind the laugh 💔
MAN: “It’s my own wedding… and I can’t even go. What do I do, yaar?” 😢 pic.twitter.com/eSKaPUrRmy https://t.co/I6mL04h4cw
— News Algebra (@NewsAlgebraIND) December 6, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




