చాణక్య నీతి : ఈ చెడు అలవాట్లే మీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి!
samatha
Pic credit - Instagram
ఆచార్య చాణక్యడు గొప్ప పండితుడు. ఈయన తత్వవేత్త, ఎన్నో అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. తన అనుభవాల ద్వారా చాలా విషయాలు తెలియజేశాడు.
ముఖ్యంగా చాణక్యడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.
అలాగే ఒక వ్యక్తి కొన్ని అలవాట్లే తమ ఇంటిలో పేదరికానికి దారితీస్తాయని చెబుతున్నాడు చాణక్యుడు. అవి ఏవో చూద్దాం.
ఆ చార్య చాణక్యుడి ప్రకారం ఎవరి ఇల్లు అయితే ఎప్పుడూ మురికిగా కనిపిస్తుందో, అలాగే గజిబిజిగా ఉంటుందో, వారి ఇంటిలో లక్ష్మీ దేవి నిలువదంట.
అలాగే ఎవరి ఇళ్లు అయితే శుభ్రంగా ఉండదో, వారి ఇంటిలో నిత్యం ఆర్థిక సమస్యలు, ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఉంటాయని, అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నాడు చాణక్యుడు.
అలాగే, ఇంటిలో విరిగినా లేదా దెబ్బతిన్న వస్తువులు ఉంచడం కూడా మంచిది కాదంట. పాత వస్తువులు ఎక్కువగా ఇంటిలో ఉండటం వలన ఇంటిలో పేదరికం ఉంటుందంట.
అలాగే ఎవరి ఇంటిలోనైతే పెద్ద పెద్దగా అరుస్తారో, ఎప్పుడూ గొడవలు ఉంటాయో, వారి ఇంటిలో పురోగతి ఉండదు, ఇది ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందంట.
అంతే కాకుండా ఎవరి ఇంటిలోనైతే సరిగ్గా నిత్యం పూజలు చేయరూ, వారి ఇంట ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయంట.