చలికాలంలో సోంపు చేసే మేలే వేరు.. ఇలా తీసుకుంటే ఆ సమస్యలు ఖతమే!
samatha
Pic credit - Instagram
సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే చలికాలంలో సోంపు తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
చలికాలంలో శరీరానికి వేడి అనేది చాలా అవసరం. అందువలన ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా ప్రతి రోజూ సోంపు గింజలను తీసుకోవాలంట.
ముఖ్యంగా వీటిని మురిగించిన పాలలో వేసుకొని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. ఇందులో ఉండే ఖనిజాలు, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుందంట.
సోంపు పాలు తాగడం వలన జీర్ణ క్రియ సమస్యలతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి,అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత సోంపు పాలు తాగడం వలన ఇది అపాన వాయువు, కడుపు ఉబ్బరం తగ్గించి, హాయిగా నిద్ర పట్టేలా చేస్తుందంట.
ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మహిళలు వీటిని తీసుకోవడం వలన కడుపు నొప్పి, కడుపులో తిమ్మిరి, అసహనం వంటి సమస్యలను తగ్గిస్తుందంట. హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరుస్తుంది.
అలాగే సోంపు గింజలను పాలల్లో వేసుకొని తాగడం వలన ఇది చలికాలంలో వచ్చే, జలుబు, దగ్గు సమస్యల నుంచి కాపాడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.