హనుమకొండలోని కుమారపల్లి మార్కెట్ వద్ద ఎల్బీ కాలేజ్ ప్రిన్సిపాల్ మదన్ మోహన్ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలు, వ్యాపారులపైకి దూసుకెళ్లడంతో ఐదు బైకులు, ఒక కారు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.