Health Insurance: రూల్స్ మారాయ్.. ఇకపై మెడికల్ క్లెయిమ్ కోసం 24 గంటలు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేదు!
మెడికల్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ పొందడానికి ఇప్పుడు 24 గంటల పాటు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వడోదరలోని వినియోగదారుల న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ మేరకు బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) కూడా స్పష్టత ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. ఈ క్లెయిమ్‌ను డే-కేర్ ట్రీట్‌మెంట్ కింద తీసుకోవచ్చని, దీని ద్వారా 24 గంటల పాటు అడ్మిట్ కాకుండానే బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ పొందవచ్చని తెలిపింది. దీంతో డే-కేర్ స్కీమ్ కింద అందించిన..
న్యూఢిల్లీ, నవంబర్ 6: ఆరోగ్య బీమాపై కంజ్యుమర్ కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. 24 గంటలు హాస్పిటల్‌లో ఉంటేనే బీమా వర్తిస్తుందనే నిబందనను కొట్టిపారేసింది. ఇది లేకుండా ఎటుంవంటి మెడికల్ క్లైమ్ చేయలేరనే సాకును అడ్డుగా పెట్టుకుని కొన్ని కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించడం వల్ల బీమా చేసినవారు తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ కూడా ఈ దిశగా పెద్ద మార్పు చేసింది.
మెడికల్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ పొందడానికి ఇప్పుడు 24 గంటల పాటు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వడోదరలోని వినియోగదారుల న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ మేరకు బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) కూడా స్పష్టత ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. ఈ క్లెయిమ్‌ను డే-కేర్ ట్రీట్‌మెంట్ కింద తీసుకోవచ్చని, దీని ద్వారా 24 గంటల పాటు అడ్మిట్ కాకుండానే బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ పొందవచ్చని తెలిపింది. దీంతో డే-కేర్ స్కీమ్ కింద అందించిన వైద్య సేవలను బీమా కంపెనీలు పరిగణనలోకి తీసుకుని బీమా చెల్లించవచ్చని తెలిపాయి. అందుకు ఆసుపత్రిలో 24 గంటల పాటు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
క్లెయిమ్ కోసం, బీమా చేయబడిన రోగి కనీసం 24 గంటలు హాస్పిటల్ సంరక్షణలో గడపవలసి అవసరం లేదని, అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయని IRDA తెలిపింది. అదే డే-కేర్ స్కీం. దీని కింద కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారు. దీనిలో భాగంగా ఏదైనా ఆపరేషన్ 24 గంటల్లో పూర్తి చేయడం, అనస్థీషియా ఉపయోగించడం వంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భాలలో 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం ఉండదని అంటూ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDA కొత్త నిబంధనలను జారీ చేసింది.
IRDAI కొత్త నిబంధనల ప్రకారం.. అనస్థీషియా ఉపయోగించే ఏదైనా ట్రీట్మెంట్ కింద ఆసుపత్రిలో 24 గంటలు గడపకుండా కూడా క్లెయిమ్ తీసుకోవచ్చు. అంటే టాన్సిల్ ఆపరేషన్, కెమోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, సైనస్ ఆపరేషన్, రేడియోథెరపీ, హిమోడయాలసిస్, కరోనరీ యాంజియోగ్రఫీ, చర్మ మార్పిడి, మోకాలి ఆపరేషన్ వంటి వాటి కోసం 24 గంటల పాటు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ ఆపరేషన్స్‌కు డే-కేర్ ట్రీట్‌మెంట్ కింద ఇన్సూరెన్స్ కంపెనీలు 24 గంటలు ఆసుపత్రిలో గడపకుండానే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే బీమా చేసిన వ్యక్తి కూడా కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ నియమం ప్రకారం, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, పరీక్షల ఫీజులు వంటివి దీనికింద క్లైం చేయడం కుదరదు. ఈ ఖర్చులను మినహాయించి బీమా చేసిన వ్యక్తి మిగిలిన మొత్తాన్ని సులభంగా క్లెయిమ్ చేయవచ్చు. ఇటీవల గుజరాత్ వినియోగదారుల న్యాయస్థానం ఇటువంటి ఓ కేసులో బీమా కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.