Heart Attack to Class 9 Student: గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధిని మృతి.. పరీక్షా హాలులోనే..!
వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు గుండెపోటుతో మరణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 50 యేళ్లు దాటిన వారు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు. కానీ నేటికాలంలో 5 యేళ్ల పసికందుకు కూడా గుండె పోటులు వస్తున్నాయి. ప్రస్తుతం కాలంలో స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ వయసు వారికి, 30 ఏళ్ల లోపు యువతే ఎక్కువగా గుండె పోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై నడుకుంటూ వెళ్లూ, శుభకార్యాల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. ఇలా ఏ పని చేస్తున్నా..
గాంధీనగర్, నవంబర్ 5: వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు గుండెపోటుతో మరణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 50 యేళ్లు దాటిన వారు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు. కానీ నేటికాలంలో 5 యేళ్ల పసికందుకు కూడా గుండె పోటులు వస్తున్నాయి. ప్రస్తుతం కాలంలో స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ వయసు వారికి, 30 ఏళ్ల లోపు యువతే ఎక్కువగా గుండె పోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై నడుకుంటూ వెళ్లూ, శుభకార్యాల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. ఇలా ఏ పని చేస్తున్నా ఒక్కసారిగా గుండె ఆగిపోయి కుప్పకూలిపోతున్నారు. తాజాగా పరీక్ష రాసేందుకు పరీక్ష హాలులోకి వెళ్లున్న 9వ తరగతి విద్యార్ధిని అక్కడికక్కడే గుండెపోటుతో మృతి చెందింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థినికి గుండెపోటు రావడమేంటని అంతా షాక్ అవుతున్నారు. తాజా సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి నగరంలో 9 తరగతి చదువుతున్న బాలిక పరీక్షా హాలులోకి వెళ్లే కొన్ని క్షణాల ముందు ఉన్నట్టుండి స్పృహతప్పి కుప్పకూలింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను స్కూల్ యాజమన్యం హాస్పిటల్‌కి తరలించింది. అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మరణించిన విద్యార్థినిని రాజ్‌కోట్ జిల్లా జస్తాన్ తాలూకాకు చెందిన సాక్ష్ రాజోసర (15)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు.
స్కూల్ ఆవరణలో బాలిక ఎగ్జామ్ హాల్ ముందు కుప్ప కూలిపోయిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోని కూడా విచారణ కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలిక హఠాత్తుగా కింద పడిపోవడానికి గుండెపోటు కారణం అయ్యి ఉంటుందని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లో ఈ మధ్య కాలంలో అనేక మంది గుండెపోటు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆకస్మిక గుండెపోటులకు కారణం తెలియక గుజరాత్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న దసరా సందర్భంగా జరిగిన గార్బా ఉత్సవాల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వరుస మరణాలు చోటుచేసుకున్నాయి.
అదే సమయంలో పలువురు గుండె నొప్పితో ఆసుపత్రుల్లో చేరారు. ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్యమంత్రి రుషికేష్ పటేల్ అధికారులతోపాటు కార్జియాలజిస్ట్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చనిపోయిన వాళ్లందరి డేటాని సేకరించి, మరణాలకు గల కారణమేంటో తెలుసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కోవిడ్-19 తర్వాత యువతలో గుండెపోట్లు అధికంగా వస్తున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. తీవ్రమైన కోవిడ్19 ఇన్ఫెక్షన్‌తో బాధపడిన వ్యక్తులు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, వారు ఎక్కువగా కష్టపడకూడదని ఇటీవల కేంద్రం ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఓ ప్రకటనలో చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.