JEE Main 2024 Notification: జేఈఈ మెయిన్స్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ఈసారి మెయిన్స్‌కు భారీగా తగ్గిన సిలబస్
జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం (నవంబర్ 2) అర్ధరాత్రి విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం ఉదయం (నవంబర్ 2) నుంచే మొదలైంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30వ తేదీ వరకూ కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో వెల్లడిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 మొదటి సెషన్ పరీక్షకు సంబంధించి..
హైదరాబాద్, నవంబర్ 3: జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం (నవంబర్ 2) అర్ధరాత్రి విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం ఉదయం (నవంబర్ 2) నుంచే మొదలైంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30వ తేదీ వరకూ కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో వెల్లడిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 మొదటి సెషన్ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లు పరీక్షకు 3 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
రెండు విడతల పరీక్ష తేదీలు
జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 తొలి దశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరుగుతుంది. పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 12వ తేదీన వెల్లడిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. రెండో విడత జేఈఈ మెయిన్స్ (ఏప్రిల్) 2024 ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ రెండింటిలో ఏ సెషన్‌కైనా హాజరుకావచ్చు. లేదా రెండింటికీ దరఖాస్తు చేసుకుని అయిన పరీక్షలు రాయవచ్చు. తెలుగు సహా దేశ వ్యాప్తంగా ఉన్న 13 ప్రధాన భాషల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. జేఈఈ పరీక్ష రాసేందుకు ఎలాంటి వయోపరిమితి లేదు. 2022, 2023లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు ఎవరైనా ఈ పరీక్షలకు హాజరుకావచ్చు.
జేఈఈ సిలబస్‌లో మార్పులివే..
కోవిడ్ సమయంలో ఎన్‌సీఈఆర్టీ, సీబీఎస్‌ఈ సిలబస్‌ను కుదించిన సంగతి విధితమే. దీంతో కొన్ని టాపిక్స్‌లో బోధన జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్స్ సిలబస్‌లోనూ ఈసారి మార్పులు చోటుచేసుకున్నాయి. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల్లో పది చొప్పున, ఫిజిక్స్‌లో 12 చొప్పున టాపిక్స్‌ను జేఈఈ మెయిన్స్‌లో రద్దు చేస్తూ కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. కఠినంగా ఉండే పరీక్షల్లో జేఈఈ కూడా ఒకటి. అయితే పేపర్ కఠినత్వాన్ని తొలగించడానికి కూడా ఈసారి పరీక్ష పేపర్ కూర్పులోనూ మార్పులు చేశారు. మ్యాథ్స్‌లో లాంగ్ మెథడ్ ప్రశ్నల నుంచి కొంత వెసులుబాటు ఇచ్చారు. అలాగే మాథ్స్‌లో కఠినంగా భావించే ట్రిగ్నామెట్రిక్స్ ఈక్వేషన్స్, మేథమెటికల్ రీజనింగ్‌ను సిలబస్ నుంచి తొలగించారు. దీనివల్ల పరీక్ష కొంతమేర సులువు అవుతుందని భావిస్తున్నారు.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి ప్రతీయేట జేఈఈ రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్, ఆడ్వాన్స్‌డ్‌లో ఆర్హత సాధించాలి. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో దాదాపు 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆడ్వాన్స్‌కు హాజరుగాని జేఈఈ మెయిన్స్ మాత్రమే రాసిన వారు మెయిన్స్ ర్యాంకు ఆధారంగా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.