Pilots: పైలట్లు మౌత్‌వాష్‌ వాడకూడదంటూ హుకూం.. ఎందుకో తెలిస్తే పరేషాన్‌

విమాన సిబ్బంది, పైలట్లు మౌత్‌వాష్‌, టూత్‌ జెల్‌లను వాడకూడదంటూ ఏవియేషన్ రెగ్యులేటర్ (DGCA) కొత్త ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆల్కహాలిక్ కంటెంట్ ఉండటమే అందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఆల్కహాల్‌ అవశేషాలు ఉండే మౌత్‌వాష్‌, టూత్‌ జెలోపాటు ఇతర ఉత్పత్తులేవీ తీసుకోకూడదంటూ హుకూం జారీ చేసింది. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో అవి వాడటంవల్ల..

Pilots: పైలట్లు మౌత్‌వాష్‌ వాడకూడదంటూ హుకూం.. ఎందుకో తెలిస్తే పరేషాన్‌
DGCA issues revised Guidelines
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 02, 2023 | 8:08 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 2: విమాన సిబ్బంది, పైలట్లు మౌత్‌వాష్‌, టూత్‌ జెల్‌లను వాడకూడదంటూ ఏవియేషన్ రెగ్యులేటర్ (DGCA) కొత్త ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆల్కహాలిక్ కంటెంట్ ఉండటమే అందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఆల్కహాల్‌ అవశేషాలు ఉండే మౌత్‌వాష్‌, టూత్‌ జెలోపాటు ఇతర ఉత్పత్తులేవీ తీసుకోకూడదంటూ హుకూం జారీ చేసింది. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో అవి వాడటంవల్ల పాజిటివ్‌ ఫలితాలొస్తున్నాయని వెల్లడించింది. వీటితోపాటు ఆల్కహాల్ వినియోగంపై సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్‌లో (సీఏఆర్‌) విమాన సిబ్బందికి వైద్య పరీక్షల ప్రక్రియకు సంబంధించి మరికొన్ని నిబంధనలకు మారుస్తూ బుధవారం (నవంబర్‌ 1) డీజీసీఏ ప్రకటన విడుదల చేసింది.

వైమానిక సిబ్బంది డ్రగ్స్‌, వాటి అవశేషాలుండే పదార్థాలను వాడకూడదు. ఏ డ్రగ్/ఫార్ములేషన్‌ను తినకూడదు. మౌత్ వాష్/టూత్ జెల్ వంటి ఏదైనా పదార్థాన్ని లేదా ఆల్కహాలిక్ కంటెంట్ ఉన్న ఏదైనా ఉత్పత్తిని ఉపయోగించకూడదు. దీనివల్ల బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో సానుకూల ఫలితాలొస్తున్నాయి. అటువంటి మందులు తీసుకుంటున్న సిబ్బంది ఎవరైనా ఉంటే అధికారులను సంప్రదించాలి. అలాగే వైద్యుల సూచన మేరకు వాడుతున్నవారు విధుల్లోకి వెళ్లేముందు తాము పని చేసే సంస్థల వైద్యులను సంప్రదించాలని డీజీసీఏ వెల్లడించింది. అయితే సవరించిన నిబంధనల్లో పెర్‌ఫ్యూమ్‌ అనే పదాన్ని వాడలేదు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో కూడిన బ్రీత్ ఎనలైజర్ టెస్టులను నేవియేషన్‌ సిబ్బందికి తప్పనిసరి చేసింది. కాలిబ్రేషన్ ఏజెన్సీల పర్యవేక్షణ, నిఘా కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. మిస్డ్ బ్రీత్ ఎనలైజర్ కేసులను నివారించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చినట్లు DGCA వెల్లడించింది. ఆపరేటింగ్ సిబ్బంది ఆపరేటింగ్ ఫ్లైట్ కోసం ర్యాంప్ టు ర్యాంప్ బదిలీ అయినప్పుడు బోర్డింగ్ స్టేషన్‌లో బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.