Gold Price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

Gold Price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

Anil kumar poka

|

Updated on: Nov 02, 2023 | 9:02 AM

గోల్డ్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై ఏకంగా 550 రూపాయలు తగ్గింది. ఇక వెండికూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండిపై 300 రూపాయల వరకూ తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర 62,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

గోల్డ్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై ఏకంగా 550 రూపాయలు తగ్గింది. ఇక వెండికూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండిపై 300 రూపాయల వరకూ తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర 62,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 56,700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,850 రూపాయలు పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,150 పలుకుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 62,350 రూపాయలుగా ఉంది. ఇటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 56,700 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా ఉంది. బెంగళూరు, కేరళలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 57,700 రూపాయలు పలుకుతుండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర 61,850 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 56,700 రూపాయలు, 24 క్యారెట్ల తులం బంగారం ధర 61,850 రూపాయలుగా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. చెన్నైలో కిలో వెండి 78,200 కాగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర 75,300 రూపాయలు వద్ద కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 78,200 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే ఇవి బుధవారం ఉదయం నాటికి నమోదైన ధరలు .. ఇవి తగ్గవచ్చు, పెరగవచ్చు.. కనుక వినియోగదారులు బంగారం, వెండి కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..