Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన గోల్డ్ ధర. తులంపై ఏకంగా..
గడిచిన రెండు రోజులుగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం తులం బంగారంపై సుమారు రూ. 500 వరకు తగ్గగగా, గురువారం కూడా బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. గురువారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 300 తగ్గి, రూ. 56,400వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 320 తగ్గి రూ. 61,350గా ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మరి గురువారం...

గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడుతోంది. మొన్నటి వరకు ప్రతీ రోజూ ఎంతో కొంత పెరుగుతూ పోయిన బంగారం ధర గడిచిన రెండు రోజులుగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం తులం బంగారంపై సుమారు రూ. 500 వరకు తగ్గగగా, గురువారం కూడా బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. గురువారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 300 తగ్గి, రూ. 56,400వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 320 తగ్గి రూ. 61,350గా ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మరి గురువారం పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,030 వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,680గా ఉంది.
* కోలకతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.
* పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,530గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,530గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలు కూడా బంగారం దారిలోన పయణిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై ఏకంగా రూ. 1200 తగ్గి రూ. 74,100 వద్ద కొనసాగుతోంది. ఇక గురువారం చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. ఒక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,100గా ఉండగా బెంగళూరులో రూ. 74,000గా ఉంది. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..