Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Charges: మీరూ గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

గ్యాస్‌ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్‌ చెప్పింది. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అదనపంగా డబ్బు అడిగితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రశీదులో ఉండే మొత్తానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌ మంగళవారం (అక్టోబర్ 31) తెలిపారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌ సెంటర్‌ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు..

LPG Cylinder Charges: మీరూ గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి
LPG Cylinder Charges
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 01, 2023 | 10:02 AM

అమరావతి, నవంబర్ 1: గ్యాస్‌ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్‌ చెప్పింది. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అదనపంగా డబ్బు అడిగితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రశీదులో ఉండే మొత్తానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌ మంగళవారం (అక్టోబర్ 31) తెలిపారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌ సెంటర్‌ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి 15 కిలో మీటర్లు ఆపై ఎక్కువ దూరం ఉండే సుదూర ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని వివరించారు.

ఈ నిబంధనలకు వ్యతిరేకంగా గ్యాస్‌ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్యాస్‌ డెలివరీ సమయంలో ఎవరైనా అదనంగా డబ్బు డిమాండ్‌ చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీకి చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌ 1967, 1800 2333555లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా ప్రస్తుతం ప్రతీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్నారు. అయితో కొందరు డెలివరీ ఛార్జెజ్‌ పేరిట గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో అక్రమార్జనకు తెరతీశారు. ఇలా జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌ సెంటర్‌ పరిధిలో నివాసం ఉన్న వినియోగదారుల వద్ద కూడా డెలివరీ కోసం అదనపు రుసుము వసూలు చేస్తున్నట్లు తరచూ ఫిర్యాదులు వస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. డెలివరీ ఛార్జీలు ఏ సందర్భంలో వసూలు చేస్తారనే విషయంపై క్లారిటీ లేకనే వినియోగదారులు వీరి ఉచ్చులో పడుతున్నారనీ, అందువల్లనే సిలిండర్ డెలివరీ కోసం ఛార్జీల అంశంపై క్లారిటీ ఇచ్చినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.