Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Poison: ప్రసాదం తిని వెయ్యి మందికిపైగా అస్వస్థత.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోడా గ్రామంలో గత శుక్రవారం (అక్టోబర్ 27)మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో త్రయోదశి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన దాదాపు 2 వేలకు పైగా ప్రజలు..

Food Poison: ప్రసాదం తిని వెయ్యి మందికిపైగా అస్వస్థత.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం
Food Poision
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 31, 2023 | 10:34 AM

కొచ్చిన్‌, అక్టోబర్‌ 31: ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోడా గ్రామంలో గత శుక్రవారం (అక్టోబర్ 27)మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో త్రయోదశి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన దాదాపు 2 వేలకు పైగా ప్రజలు కుంటుంబంతో సహా హాజరయ్యారు. పూజ అనంతరం అనేక మంది అక్కడ పంచి పెట్టిన ప్రసాదం తిన్నారు. భోజనాలు కూడా చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అనేక మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దీంతో హుటాహుటీన సమీపంలోని పూంఛ్, సమతార్, మంత్లోని ప్రాంతాల్లో దాదాపు అన్ని ఆసుపత్రులకు బాధితులను తరలించారు. వారిలో పలువురికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం మరికొందరిని ఝాన్సీ, గ్వాలియర్, కస్బా పూంచ్, సామ్తార్‌లలోని ఆసుపత్రులకు బాధితులను అంబులెన్స్‌లలో తరలించారు. రోగులకు తరలించేందుకు అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్డీఎం మనోజ్ కుమార్ సరోజ్, మంత్ సీహెచ్ సీ సూపరింటెండెంట్ మాతా ప్రసాద్ రాజ్‌పుత్ బరోడా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు ఇదే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తనయుడు రాహుల్ రాజ్‌పుత్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో జిల్లా యంత్రాంగం ఆ గ్రామానికి చేరుకుని, విచారణ చేపట్టింది. ఆహార పదార్థాల నమూనాను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ ఘటనపై మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ స్పందించారు. గత శుక్రవారం నాడు నిర్వహించిన త్రయోదశి కార్యక్రమానికి సమీపంలోని 40 గ్రామాలను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. సుమారు రెండున్నర వేల మంది ఈ కార్యక్రమానికి పాల్గొన్నారన్నారు. తనను నేరుగా ఎదుర్కోలేక రాజకీయ ప్రత్యర్ధులే ఆహారంలో విషపదార్థాలు కలిపి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ఉగ్రదాడిపై ట్రంప్ సీరియస్.. భారత్‌కు అండగా ఉంటామంటూ పిలుపు
ఉగ్రదాడిపై ట్రంప్ సీరియస్.. భారత్‌కు అండగా ఉంటామంటూ పిలుపు
గణపతి ప్రసన్నం కోసం బుధవారం ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి...
గణపతి ప్రసన్నం కోసం బుధవారం ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి...
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. బడులకు వేసవి సెలవులు 2025 వచ్చేశాయ్!
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. బడులకు వేసవి సెలవులు 2025 వచ్చేశాయ్!
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..