TS Voter Registration Deadline: రేపటితో ముగుస్తోన్న ఓటర్ల నమోదు ప్రక్రియ.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఓటు పొందని వారు కొత్తగా ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరితోపాటు ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో పేరులేని వారంతా కొత్తగా మళ్లీ ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. జాబితాలో పేరు ఉన్నా వారి నివాసం వేరే చోటికి మార్చినా.. పేరు వంటి ఇతర వివరాలు..

TS Voter Registration Deadline: రేపటితో ముగుస్తోన్న ఓటర్ల నమోదు ప్రక్రియ.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?
TS Voter Registration Deadline
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 30, 2023 | 10:21 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఓటు పొందని వారు కొత్తగా ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరితోపాటు ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో పేరులేని వారంతా కొత్తగా మళ్లీ ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. జాబితాలో పేరు ఉన్నా వారి నివాసం వేరే చోటికి మార్చినా.. పేరు వంటి ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యి ఉన్నా వారంతా నవంబర్‌ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హులుగా ఎంచబడతారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 31వ తేదీలోపు అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ, పేరు, ఫొటో వివరాలను దిద్దుకోవడానికి ఫారం 8 దరఖాస్తులను ఈ తేదీలోగా సమర్పిస్తే వారందరికీ ఓటు హక్కు లభిస్తుంది.

ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. అందులో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.

కాగా నవంబర్‌ 3న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. అదే నెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఇక మినేషన్ల దాఖలుకు సరిగ్గా 10 రోజుల ముందు అంటే అక్టోబర్‌ 31వ తేదీ నాటికి ఓటర్ల నమోదు దరఖాస్తులు నిలిపివేస్తారు. తుది తేదీ ముగిసేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, వివరాల దిద్దుబాటుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ?

ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లో అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ (వీహెచ్‌ఏ)ను మొబైల్‌ఫోన్‌లోని ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా స్థానిక బీఎల్‌ఓ, ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో)ను కలసి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లేటెస్ట్‌ పాస్‌ ఫొటో, చిరునామా, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల పత్రం, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, కరెంట్‌ బిల్లు, గ్యాస్‌ లేదా బ్యాంక్‌ పాసుపుస్తకాలు వంటి పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? అనేది తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా  అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ ఫోన్‌ నంబర్, ఎపిక్‌ కార్డు నంబర్‌ ఆధారంగా జాబితాలో పేరు తనిఖీ చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.