USA President Elections: అమెరికా అధ్యక్ష బరి నుంచి వైదొలిగిన మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్.. కారణం ఇదే!

వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల (2024) బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత మైక్‌ పెన్స్‌ శనివారం (అక్టోబర్‌ 28) ప్రకటించారు. లాస్ వెగాస్‌లో జరిగిన రిపబ్లికన్ జెవిష్‌ కొయిలేషన్‌ వార్షిక సదస్సులో ఆయన ఈ మేరకు స్వయంగా వెల్లడించారు. 2024లో జరగనున్న ఎన్నికలకు ప్రచారాన్ని నిలిపివేసిన మొదటి ప్రధాన అభ్యర్ధిగా ఆయన నిలిచారు. నాకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తోంది నా టైం కాదు. అనేక చర్చల..

USA President Elections: అమెరికా అధ్యక్ష బరి నుంచి వైదొలిగిన మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్.. కారణం ఇదే!
Mike Pence
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 29, 2023 | 11:10 AM

వాషింగ్టన్, అక్టోబర్‌ 29: వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల (2024) బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత మైక్‌ పెన్స్‌ శనివారం (అక్టోబర్‌ 28) ప్రకటించారు. లాస్ వెగాస్‌లో జరిగిన రిపబ్లికన్ జెవిష్‌ కొయిలేషన్‌ వార్షిక సదస్సులో ఆయన ఈ మేరకు స్వయంగా వెల్లడించారు. 2024లో జరగనున్న ఎన్నికలకు ప్రచారాన్ని నిలిపివేసిన మొదటి ప్రధాన అభ్యర్ధిగా ఆయన నిలిచారు. ‘నాకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తోంది నా టైం కాదు. అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా ప్రచార కార్యక్రమాలను నిలిపివేస్తున్నాను. ఇది ఊహించని నిర్ణయం. మీ అందరినీ ఆశ్చర్యపరచినప్పటికీ వచ్చే ఏడాది జరగనున్న ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో రిపబ్లికన్‌ నేతలకు మద్దతు ఇస్తాను. వారి విజయాల కోసం కృషి చేస్తానని’ పెన్స్‌ తెలిపారు.

నాలుగేళ్లుగా వైట్‌హైస్‌ అభిశంసన, పలు కుంభకోణాలు ఇతర అభియోగాల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ నుంచి ఈ సారి అధ్యక్ష పదవికోసం రేసులో ఉన్నారు. ఈ క్రమంలో పెన్స్‌ తాను బరి నుంచి వైదొలిగి రిపబ్లికన్‌ పార్టీ నేతలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్‌లో వెనుకబడటం కూడా పెన్స్‌ అధ్యక్ష బరి నుంచి వైదొలిగడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

2020 బైడెన్‌ విజయాన్ని తారుమారు చేసేందుకు యత్నించడంలో, ఎన్నికల ఫలితాను ధిక్కరించడంతో ట్రంప్‌కు బలమైన గొంతుకగా నిలిచాడు. ట్రంప్‌ హయాంలో పెన్స్‌ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్‌ కాంగ్రెస్‌సభ్యుడిగా పని చేశాడు. రాజకీయాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ, అతనికి ప్రచారం సవాలుగా మారింది. ఎన్నికల్లో పెన్స్‌కు సరైన మద్దతు లేకపోవడంతోపాటు నవంబర్ 8న మియామిలో ప్రాథమిక అభ్యర్థుల చర్చకు ఆయనకు ఆహ్వానం అందలేదు. దీంతో అవమానంగా భావించిన ఆయన ఈ మేరకు శనివారం ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

పెన్స్ నిష్క్రమణ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. మాజీ వైస్ ప్రెసిడెంట్ సంప్రదాయ విలువలకు కట్టుబడి ముందుకు తీసుకెళ్లడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న సూత్రప్రాయ వ్యక్తి అని పోస్ట్ చేసింది. రిపబ్లికన్ అభ్యర్థులు దేశవ్యాప్తంగా అబార్షన్‌ను నిషేధించడం, సామాజిక భద్రత, మెడికేర్‌లను తగ్గించడం, ఎన్నికల తిరస్కారుల కోసం ప్రచారం చేయడం వంటి అంశాలను తమ ఎజెండాగా ప్రచారం సాగిస్తున్నారు. కాగా 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, ర్యాన్‌ బింక్లీ, టిమ్‌ స్కాట్‌, నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామితోపాటు ఇతరులు పోటీపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.