Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కలచివేస్తోన్న తల్లి ప్రేమ.. దూడ కోసం 5 కిలోమీటర్లు ఆటో వెంట పరుగులు తీసిన ఆవు!

ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టుకకు ఓ అమ్మ కారణం. అమ్మతనం ఒక్క మనిషికే కాదు నోరులేని మూగ జీవాలకు కూడా ప్రత్యేకమే. గర్భంలో బిడ్డను మోసి ప్రసవ వేదన పడి కన్న ఆ బిడ్డ పట్ల తల్లి ప్రేమ అనంతం. అందుకే ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదని ప్రతి ఒక్కరూ అంటుంటారు. తాజగా ఓ ఆవు ఇదే విషయాన్ని మరోమారు నిరూపించింది. పేగు తెంచుకు పుట్టిన దూడను ఆటోలో తీసుకెళ్తుంటే ఆ తల్లి నిలువలేకపోయింది. బహుశా నోరు ఉండి ఉంటే సింహం కంటే గట్టిగా గర్జించి..

Viral News: కలచివేస్తోన్న తల్లి ప్రేమ.. దూడ కోసం 5 కిలోమీటర్లు ఆటో వెంట పరుగులు తీసిన ఆవు!
Mother Cow Runs 5 Km For Her Calf
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 25, 2023 | 9:18 AM

చెన్నై, అక్టోబర్ 25: ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టుకకు ఓ అమ్మ కారణం. అమ్మతనం ఒక్క మనిషికే కాదు నోరులేని మూగ జీవాలకు కూడా ప్రత్యేకమే. గర్భంలో బిడ్డను మోసి ప్రసవ వేదన పడి కన్న ఆ బిడ్డ పట్ల తల్లి ప్రేమ అనంతం. అందుకే ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదని ప్రతి ఒక్కరూ అంటుంటారు. తాజగా ఓ ఆవు ఇదే విషయాన్ని మరోమారు నిరూపించింది. పేగు తెంచుకు పుట్టిన దూడను ఆటోలో తీసుకెళ్తుంటే ఆ తల్లి నిలువలేకపోయింది. బహుశా నోరు ఉండి ఉంటే సింహం కంటే గట్టిగా గర్జించి ఉండేదేమో. ఏమీ చెయ్యలేని ఆ నిస్సహాయ ఆవు కన్నీళ్లు పెట్టుకుంటూ దూడను తరలిస్తున్న ఆటో వెనుక పరుగులు తీసింది. ఇలా సుమారు ఐదు కిలోమీటర్లు దూడ వెనుక తల్లి ఆవు పరుగులు తీయడం చూపరులను కలచివేసింది. ఈ హృదయ విదరక ఘటన తమిళనాడులోని తంజావూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

తమిళనాడులోని తంజావూరు సెక్కడికి చెందిన శబరినాథన్‌ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లో వీరలక్ష్మి అనే ఆవుని పెంచుకుంటున్నాడు. ఎప్పటి మాదిరిగానే సోమవారం కూడా తొంబన్ గుడిసె ప్రాంతంలో ఆవు మేతకు వెళ్లింది. కానీ అదే రోజు సాయంత్రం అది ఈనింది. చాలా సేపు ఆవు కనిపించకపోవడంతో ఆవు యజమాని పలు ప్రాంతాల్లో వెతకగా, ఆవు దూడతో పాటు ఓ చోట కనిపించింది. దీంతో యజమాని శబరినాథన్‌ దూడను ఆటోలో వేసుకొని ఇంటికి తీసుకెళ్లేందుకు బయల్దేరాడు. కానీ తల్లి ఆవు దూడను ఒంటరిగా వదలలేక ఆటో వెంట పరుగందుకుంది. అప్పుడే ఈనిన బాలింత ఆవు తన తల్లి ప్రేమ శక్తిని నింపిందేమో ఏకంగా 5 కిలోమీటర్లు ఆటో వెంట పరుగు కొనసాగించింది.

ఆవు ఆవేదనను అర్థం చేసుకొన్న యజమాని శబరినాథన్‌ ఆటో ఆపి దూడను దాని వద్ద వదిలేశాడు. వెంటనే తల్లి ఆవు మురిపెంగ దూడను నాలుకతో నాకుతూ, ఆలింగనం చేసుకుని కాసేపు పాలు పట్టింది. దూడ కోసం తల్లి ఆవు చేసిన పోరాటం చూపరులను కలచివేసింది. దీంతో శబరినాథన్‌ కూడా దూడను వేరుగా తీసుకెళ్లకుండా రెండింటినీ కలిపి ఇంటికి తీసుకెళ్లారు. మాతృ వాత్సల్యం సర్వజీవులకు సమానమని చాటి చెప్పింది ఈ సంఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆవు-దూడల ఈ ప్రేమ పోరాటం చూసిన నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.