AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదర్శ వివాహం..రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట..! పెళ్లి మండపంలో అంబేద్కర్‌, నెహ్రూలు..

కొల్లంలో జరిగిన ఓ వివాహ వేడుక అందరినీ ఆకట్టుకుంది. చటన్నూర్‌కు చెందిన అభిన్, దేవికల పెళ్లి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లికి వచ్చిన వాళ్లంతా పెళ్లి దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. వివాహాన్ని విభిన్నంగా, వైవిధ్యంగా మార్చే కొత్త యుగంలో ఈ వివాహం అన్నింటికంటే భిన్నంగా కనిపించింది. ఇంటర్‌నెట్‌లో ఇప్పుడు ఈ పెళ్లి తంతు తెగ సందడి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆదర్శ వివాహం..రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట..! పెళ్లి మండపంలో అంబేద్కర్‌, నెహ్రూలు..
Wedding Reception In Kollam
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2023 | 8:55 AM

Share

వివాహాన్ని విభిన్నంగా, వైవిధ్యంగా మార్చుకోవడం నేటి కొత్త తరం ట్రెండ్. వివాహ వేడుకల స్టైల్‌ మారింది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా, వినూత్న రీతుల్లో వివాహ వేడుకలు జరుపుకుంటారు. అయితే కొల్లంలో జరిగిన ఓ వివాహ వేడుక అందరినీ ఆకట్టుకుంది. చటన్నూర్‌కు చెందిన అభిన్, దేవికల పెళ్లి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లికి వచ్చిన వాళ్లంతా పెళ్లి దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. వివాహాన్ని విభిన్నంగా, వైవిధ్యంగా మార్చే కొత్త యుగంలో ఈ వివాహం అన్నింటికంటే భిన్నంగా కనిపించింది. ఇంటర్‌నెట్‌లో ఇప్పుడు ఈ పెళ్లి రిసెప్షన్ తంతు తెగ సందడి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అభిన్, దేవికల వివాహ వేడుక కోసం కళ్యాణ మండపానికి వెళ్లే ప్రవేశ ద్వారం ముందు భారత రాజ్యాంగ పీఠిక ఉంది. మండపం వెనుక అంబేద్కర్, నెహ్రూ ఆపై రాజ్యాంగం పండల్‌లో ఉంది. తాళి కట్టిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఒకరికొకరు అందజేసుకున్నారు. పెళ్లి అంటే ఇదే కదా! ఇది రాజ్యాంగ అక్షరాస్యత ప్రచారకుల పెళ్లి ఇలాగే ఉంటుంది మరీ. వీరిద్దరూ భారతదేశపు మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యత ప్రాజెక్ట్ అయిన సిటిజన్ 22లో భాగంగా కొల్లం జిల్లాలో పనిచేశారు. కాన్‌స్టిట్యూషన్ సెనేటర్స్ క్లాస్ సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.

వివాహానికి హాజరైన వారందరికీ రాజ్యాంగ సూత్రాలు, హక్కులను వివరించే కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. వివాహ ఆహ్వాన పత్రికలో అంబేద్కర్, నెహ్రూ కూడా ఉన్నారు. ఇలా పెళ్లి చేసుకోవాలనే కోరికను దేవిక, అభి వ్యక్తం చేయడంతో కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

వధూవరులు చటన్నూరుకు చెందిన దేవిక, అభి. ఏళ్ల తరబడి రాజ్యాంగ విలువలను ప్రజలకు చేరవేస్తున్న వాళ్లమని, మాటలకు, చేతలకు రెండు దిక్కులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇలా చేశామని చెప్పారు. కుటుంబ జీవితంలో ఒక ఉదాహరణగా ఉంచడం ద్వారా మాత్రమే ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ అందించగలమని అబి విశ్వసిస్తుండగా, తన పట్ల రాజ్యాంగ విలువలను కూడా సమర్థించే అబి వ్యక్తిత్వం తనను ఎక్కువగా ఆకట్టుకుందని దేవిక తెలిపారు. వివాహానికి హాజరైన వారందరికీ రాజ్యాంగ సూత్రాలు, హక్కులను వివరించే కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. వివాహ ఆహ్వాన పత్రికలో అంబేకర్, నెహ్రూ కూడా ఉన్నారు. ఇలా పెళ్లి చేసుకోవాలనే కోరికను దేవిక, అభి వ్యక్తం చేయడంతో కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..