Free Visa: వీసా అవసరం లేదు .. శ్రీలంకకు ఫ్రీ ఎంట్రీ.. 7 ఇతర దేశాల టూరిస్టులకు ఆహ్వానం.
పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలూ ఇందులో ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ తెలిపారు.
పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలూ ఇందులో ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. విదేశీ మారకం దీని ద్వారానే వస్తుంది. కొవిడ్-19కు తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక తగ్గింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊపిరి పోయాలని ఆ దేశం నిర్ణయించింది. 2023 సంవత్సరానికి గాను 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. ముందుగా 5 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌కు అనుమతివ్వాలని భావించారు. దాన్ని తాజాగా 7కు పెంచుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

