Rajasthan Elections: భర్తపై ప్రత్యర్థిగా భార్య పోటీ.. ఒకే ఇంట్లో పరస్పర ప్రత్యర్థులుగా భార్యభర్తలు! వీరి కాపురానికే ఎన్ని కష్టాలో
రాజస్థాన్‌లోని దాంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ ప్రాంతంలో జరుగుతోన్న ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఇందులో అంత విశేషం ఏం ఉంది? అని పెదవి విరవకండి.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఆయనేమో కాంగ్రెస్‌వైపు.. ఆవిడేమో ఆయనకు పోటీగా ప్రత్యర్ధి పార్టీవైపు. దీంతో భార్యభర్తలిద్దరూ పరస్పరం ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలు ఉండటమే ఆ వార్త ప్రత్యేకత. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్..
జైపూర్, అక్టోబర్ 25: రాజస్థాన్‌లోని దాంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ ప్రాంతంలో జరుగుతోన్న ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఇందులో అంత విశేషం ఏం ఉంది? అని పెదవి విరవకండి.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఆయనేమో కాంగ్రెస్‌వైపు.. ఆవిడేమో ఆయనకు పోటీగా ప్రత్యర్ధి పార్టీవైపు. దీంతో భార్యభర్తలిద్దరూ పరస్పరం ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలు ఉండటమే ఆ వార్త ప్రత్యేకత. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి. పీసీసీ మాజీ అధ్యక్షుడేకాకుండా ఏడుసార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన నారాయణ్ సింగ్ కుమాడే వీరేంద్ర సింగ్.
నవంబర్ 25న జరగనున్న పోలింగ్‌కు రామ్‌గఢ్‌లో ఆయన మళ్లీ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆయన భార్య రీటా చౌధరీ రూపంలో సొంత ఇంట్లోనే ప్రత్యర్థి ఉండటం విశేషం. 2018లో కాంగ్రెస్ తరఫున దాంతా రామ్‌గఢ్ టికెట్ ఆశించిన రీటాకు మొండిచేయి చూపి, ఆమె భర్తకు టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన రీటా రాజకీయంగా ఎదగడంపై దృష్టిపెట్టారు. గత ఆగస్టులో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)లో ఆమె తీర్థం పుచ్చుకోవడంతోనే పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లో తమ అభ్యర్థిగా రీటాను జేజేపీ ప్రకటించింది. సోమవారం జేజేపీ విడుదల చేసిన ఆరుగురు అభ్యర్ధుల జాబితాలో రీటా పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
నేను నా మనసు మాట వింటాను. ఏది సరైందని అనిపించిందో.. అదే చేశాను. అందుకే జేజేపీలో చేరాను. వారు నాకు అండగా నిలిచారు. ప్రజలు కూడా నన్ను, నా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాను. పార్టీ నన్ను దంతా రామ్‌గఢ్ స్థానం నుండి అభ్యర్థిగా ఎంపిక చేసింది. నేను తప్పక విజయం సాధిస్తాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. భర్తతో పోటీపై ప్రశ్నించగా.. కాంగ్రెస్‌లో ఇంకా నా భర్తకు టికెట్ ఖరారు కాలేదు. కాబట్టి ఇప్పుడే దానిపై మాట్లాడను. కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నాను. అభివృద్ధి, నీటి సమస్యలు, నిరుద్యోగం తదితర సమస్యలపై ఎన్నికల్లో పోటీ చేస్తానని చౌదరి తెలిపారు.
మరోవైపు.. వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. జేజేపీ ఆమెను రంగంలోకి దింపింది. నేను కూడా రీనామినేషన్ పొందుతానని ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు మా భార్యభర్తల మధ్య ప్రత్యక్ష పోరు అవుతుందని పేర్కొన్నారు. 2018లో వీరేంద్ర సింగ్ తండ్రి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో వీరేంద్ర సింగ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నారాయణ్ సింగ్ 1972, 1980, 1985, 1993, 1998, 2003, 2013లో ఏడుసార్లు MLAగా గెలిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.