AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal Mine Fire Accident: బొగ్గు గనిలో ఘోర అగ్ని ప్రమాదం.. 28 మంది మృతి,16 మంది గల్లంతు

ఖజకిస్తాన్‌లోని కొస్టెంకో బొగ్గు గనిలో శనివారం (అక్టోబర్ 28) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 28 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 16 మంది కార్మికులు గల్లంతయ్యినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ మంత్రి అల్ జజీరా వెల్లడించారు. లగ్జెంబర్గ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్‌ మిట్టల్‌ టెమిర్టౌ ఈ బొగ్గు గని పనులను పర్యవేక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్‌ ఉత్పత్తిదారు. దీని ఆధ్వర్యంలో కరగండ ప్రాంతంలో ఎనిమిది బొగ్గు గనులు..

Coal Mine Fire Accident: బొగ్గు గనిలో ఘోర అగ్ని ప్రమాదం.. 28 మంది మృతి,16 మంది గల్లంతు
Coal Mine Fire Accident
Srilakshmi C
|

Updated on: Oct 29, 2023 | 10:10 AM

Share

లండన్‌, అక్టోబర్‌ 29: ఖజకిస్తాన్‌లోని కొస్టెంకో బొగ్గు గనిలో శనివారం (అక్టోబర్ 28) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 28 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 16 మంది కార్మికులు గల్లంతయ్యినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ మంత్రి అల్ జజీరా వెల్లడించారు. లగ్జెంబర్గ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్‌ మిట్టల్‌ టెమిర్టౌ ఈ బొగ్గు గని పనులను పర్యవేక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్‌ ఉత్పత్తిదారు. దీని ఆధ్వర్యంలో కరగండ ప్రాంతంలో ఎనిమిది బొగ్గు గనులు, మధ్య ఆసియాలోని మధ్య, ఉత్తర ఖజకిస్తాన్‌లో మరో 4 ఇనుప ఖనిజం గనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు అనుబంధంగా ఖజకిస్తాన్‌లో ఆర్సెలర్‌ మిట్టల్‌ టెమిర్టౌ పనిచేస్తుంది.

శనివారం నాడు కోస్టెంకో గనిలో ఈ ప్రమాదం సంభవించిన సమయంలో గనిలో 252 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 208 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలలకు తరలించారు. మిగిలిన వారిలో 28 మంది మృతి చెందగా.. 16 మంది కార్మికుల కోసం గాలిస్తున్నారు. మీథేన్‌ గ్యాస్‌ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ఘోర ప్రమాదం నేపథ్యంలో ఖజకిస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సెలార్‌మిట్టల్ టెమిర్టౌ మైనింగ్ కంపెనీతో పెట్టుబడులను నిలిపివేస్తున్నట్లు ఖజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు అమలు చేయవల్సిందిగా ఆ దేశ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేకాకుండా దేశంలో ఆర్సెలర్‌ మిట్టల్‌ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను మొత్తం జాతీయం చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం గని అగ్ని ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాన్ని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు. గనిలో జరిగిన ప్రమాదానికి గల కారణాలను అన్వేషించాలని ఖజకిస్తాన్‌ ప్రధాన మంత్రి అలీఖాన్ స్మైలోవ్‌ను ఆదేశించారు. గనిలో అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, అదే సమయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి క్షతగాత్రులకు, కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా గత ఆగస్టు నెలలో కూడా ఇదే గనిలో మంటలు చెలరేగడంతో నలుగురు కార్మికులు మరణించారు. నవంబర్ 2022 లో మరొక ప్రదేశంలో మీథేన్ లీక్ కారణంగా ఐదుగురు కార్మికులు మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే