Live Octopus Dish: లైవ్ ఆక్టోపస్ వంటకాన్నిటేస్ట్ చేసి ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు..
ఆక్టోపస్ మెలికలు తిరిగే పార్శ్‌వాంగాలతో చూడటానికి కొంత భయంకరంగానే ఉంటుంది. తమకు ఆహారంగా ఉపయోగపడే జీవులపై దాడి చేసి చంపి తినేందుకు ఆక్టోపస్‌లు ఆ పార్శ్వాంగాలను వినియోగించుకుంటాయి. అయితే దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్‌లతో చేసే ప్రముఖ ‘సాన్ నాజ్కి’ అనే వంటకం రుచి చూసి మృతిచెందాడు. ప్రాణంతో ఉన్న ఆక్టోపస్‌ను ముక్కలుగా కోసి దానిపై నువ్వులు, కొన్ని రకాల మసాలాలను కలిపితే ఈ సాన్ నాజ్కి వంటకం రెడీ అవుతుంది.
ఆక్టోపస్ మెలికలు తిరిగే పార్శ్‌వాంగాలతో చూడటానికి కొంత భయంకరంగానే ఉంటుంది. తమకు ఆహారంగా ఉపయోగపడే జీవులపై దాడి చేసి చంపి తినేందుకు ఆక్టోపస్‌లు ఆ పార్శ్వాంగాలను వినియోగించుకుంటాయి. అయితే దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్‌లతో చేసే ప్రముఖ ‘సాన్ నాజ్కి’ అనే వంటకం రుచి చూసి మృతిచెందాడు. ప్రాణంతో ఉన్న ఆక్టోపస్‌ను ముక్కలుగా కోసి దానిపై నువ్వులు, కొన్ని రకాల మసాలాలను కలిపితే ఈ సాన్ నాజ్కి వంటకం రెడీ అవుతుంది. దక్షిణ కొరియా వృద్ధుడు కూడా ఇలాగే తయారు చేసిన సాన్ నాజ్కి వంటకాన్ని ఆరగించాడు. అయితే అతను తింటున్నప్పుడు ఆ ఆక్టోపస్ పార్శ్వాంగ ముక్కలు కదులుతూనే ఉన్నాయి. దాంతో ఆక్టోపస్ పార్శ్వాంగం ముక్క ఒకటి మెలికలు తిరుగుతూ ఆ వృద్ధుడి గొంతులో ఇరుక్కుపోయింది. తర్వాత ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురై ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ లైవ్ ఆక్టోపస్ రెసిపీని 2003లో దక్షిణ కొరియాలో ఓ సినిమా నటుడు చేసి చూపించటంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి చాలా మంది లైవ్ ఆక్టోపస్ రెసిపీని టేస్ట్ చేయడం ప్రారంభించారు. కానీ, ఇలా లైవ్ ఆక్టోపస్ రెసిపీని టేస్ట్ చేసి ఇప్పటికే ఇద్దరు మరణించారు. తాజాగా దక్షిణ కొరియా వృద్ధుడి మరణంతో ఆక్టోపస్ వంటకం తిని మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

