పిల్లలు పుట్టడంలేదనీ 34 ఏళ్ల క్రితం వైద్యం కోసం డాక్టర్‌ వద్దకు వెళ్లిన మహిళ.. ఇన్నాళ్లకు బయటపడ్డ మోసం!

అమెరికాలో ఓ ఫెర్టిలిటీ ఆసుపత్రి వైద్యుడిపై కేపు పెట్టింది. దాదాపు 34 ఏళ్ల క్రితం కృత్రిమ గర్భధారణ కోసం ఆ ఆసుపత్రికి రాగా గర్భధారణ ప్రక్రియ కోసం సదరు వైద్యుడు తన సొంత స్పెర్మ్‌ను మోసపూరితంగా వినియోగించినట్లు బాధిత మహిళ ఆరోపించింది. 1989 నాటి సంగతి ఇది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఈ విచిత్ర ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఆ మహిళ వయసు 67 ఏళ్లు. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలోని హౌసర్‌కు చెందిన షారన్ హేస్‌ (67) 1989లో వాషింగ్టన్‌లోని స్పోకేన్‌లో..

పిల్లలు పుట్టడంలేదనీ 34 ఏళ్ల క్రితం వైద్యం కోసం డాక్టర్‌ వద్దకు వెళ్లిన మహిళ.. ఇన్నాళ్లకు బయటపడ్డ మోసం!
US Woman Sues Doctor
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 29, 2023 | 11:52 AM

వాషింగ్టన్‌, అక్టోబర్ 29: అమెరికాలో ఓ ఫెర్టిలిటీ ఆసుపత్రి వైద్యుడిపై కేపు పెట్టింది. దాదాపు 34 ఏళ్ల క్రితం కృత్రిమ గర్భధారణ కోసం ఆ ఆసుపత్రికి రాగా గర్భధారణ ప్రక్రియ కోసం సదరు వైద్యుడు తన సొంత స్పెర్మ్‌ను మోసపూరితంగా వినియోగించినట్లు బాధిత మహిళ ఆరోపించింది. 1989 నాటి సంగతి ఇది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఈ విచిత్ర ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఆ మహిళ వయసు 67 ఏళ్లు. అసలేం జరిగిందంటే..

అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలోని హౌసర్‌కు చెందిన షారన్ హేస్‌ (67) 1989లో వాషింగ్టన్‌లోని స్పోకేన్‌లో ఉన్న ప్రసూతి వైద్యుడు డాక్టార్ డేవిడ్ ఆర్‌ క్లేపూల్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె సదరు వైద్యుడి వద్ద సంతానోత్పత్తి చికిత్స చేయించుకుంది. ఆమె భర్త ద్వారా గర్భం దాల్చడంలో ఇబ్బంది ఎదుర్కోవడం వల్ల కృత్రిమ పద్ధతుల్తో గర్భం దాల్చాలనుకుంది. అయితే తనకు సంతానదానం చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరింది. అంతేకాకుండా తనకు పరిచయమేలేని, తనకు ఏమాత్రం తెలియని కొత్త వ్యక్తి నుంచి స్పెర్మ్‌ తీసుకోవాలని ఆమె ముందుగానే వైద్యుడిని కోరింది. ఆ ప్రకారంగానే జుట్టు, కళ్ల రంగు ఆధారంగా ఎంపిక చేసిన దాతకు ఆరోగ్య, జన్యు పరమైన అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతనే స్పెర్మ్‌ ప్రవేశపెడతామని హామీ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ డాక్టర్ క్లేపూల్ మోసపూరితంగా తన సొంత స్పెర్మ్‌ను వినియోగించినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. చికిత్స కోసం ఆమె వంద డాలర్లు చెల్లించినట్లు తన దావాలో పేర్కొంది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్‌ 25) స్పోకేన్ కౌంటీ సుపీరియర్ కోర్టులో డాక్టర్ డేవిడ్‌పై షారన్ దావా వేసింది.

అనామక దాతగా ఉండాలనేది తన అభిమతమని షారన్ తన ఫిర్యాదులో రాసింది. కానీ డాక్టర్ డేవిడ్ క్లేపూల్ తప్పుడు సమాచారాన్ని అందించారని ఆరోపించింది. కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన షారన్ కుమార్తె బ్రియానా హేస్ వయస్సు ప్రస్తుతం 33 ఏళ్లు. డీఎన్ఏ పరీక్ష, వంశవృక్షం కనుగొనేందుకు 23andMe అనే జెనెటిక్‌ టెస్టింగ్‌ వెబ్‌సైట్‌కి బ్రియానా వివరాలు సమర్పించగా తన జీవసంబంధమైన తండ్రిని గతేడాది గుర్తించింది. బ్రియానా తన చుట్టూ కనీసం 16 మంది తోబుట్టువులు ఉన్నారని మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది. తన తల్లి విషయంలో జరిగిన మోసమో చాలా మంది మహిళలకు జరిగిందని బ్రియానా గ్రహించింది. అయితే వైద్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇది ఖచ్చితంగా గుర్తింపు సంక్షోభం అని బ్రియానా హేస్ పేర్కొన్నారు. దీనిపై వైద్యుడు మాట్లాడుతూ.. తన వద్ద వైద్యం చేయించుకన్న వారు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ 40 ఏళ్ల సర్వీస్‌లో తాను మొదటిసారి ఇలాంటి కేసు వింటున్నానని డాక్టర్ డేవిడ్ అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.