Telangana Elections: ఇప్పటివరకు ఒక్క సీటూ గెలవలేదు.. అయినా ఆ పార్టీ బీ ఫామ్స్ అంటే యమ క్రేజ్.. అసలు విషయమిదే
అధికార ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల లొల్లి కామన్.. ఇక కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే బీ ఫామ్ గురించి యుద్ధాలు జరుగుతాయి. ఇక కమ్యూనిస్టు పార్టీలు, కొత్తగా వచ్చిన మరి కొన్ని పార్టీల్లో కూడా టికెట్ల కోసం ఎంతో కొంత పోటీ ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుకుంటుంది మీరు పెద్దగా ఎక్కడా వినని రాజకీయ పార్టీ గురించి..

అధికార ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల లొల్లి కామన్.. ఇక కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే బీ ఫామ్ గురించి యుద్ధాలు జరుగుతాయి. ఇక కమ్యూనిస్టు పార్టీలు, కొత్తగా వచ్చిన మరి కొన్ని పార్టీల్లో కూడా టికెట్ల కోసం ఎంతో కొంత పోటీ ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుకుంటుంది మీరు పెద్దగా ఎక్కడా వినని రాజకీయ పార్టీ గురించి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఈ పార్టీకి ఎక్కడా కేడర్ కనిపించదు. అసలు రాష్ట్ర నాయకత్వం ఎవరో చాలామందికి తెలియదు. అంతెందుకు ఎన్నికలప్పుడు తప్ప.. ఆ పార్టీ సింబల్ జెండా ఇంకెప్పుడూ కనిపించదు కూడా. కానీ ఆ పార్టీ బీఫామ్ కు మాత్రం మస్త్ క్రేజ్ ఉంది. అయితే ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ల గురించి పోటీ ఉండదు. ఇతర పార్టీలో టికెట్లు పంచాయతీ ముగిసాకా ఇక్కడ పంచాయతీ మొదలవుతుంది. ప్రధాన పార్టీలో టికెట్లు రాని అభ్యర్థులంతా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతారు. ఆ దశలో వాళ్లకి ఒక మంచి సింబల్ అవసరం ఉంటుంది. ఈజీగా ప్రజల్లోకి దూసుకుపోయేందుకు, ప్రచారంలో అందరినీ ఆకర్షించేందుకు ఒక మంచి గుర్తు స్వతంత్ర అభ్యర్థికి చాలా అవసరం. అదే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కి ప్లస్ పాయింట్. ఈ పార్టీ సింబల్ పులి గుర్తు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రధాన పార్టీలో టికెట్ రాకపోతే మీ బీఫారం నుంచి పోటీ చేస్తామని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సమాచారం ఇచ్చారట.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎక్కడిది అంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన పార్టీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సింహాల్లా గర్జిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో అతివాద భావంతో పోరాడాలని ఈ పార్టీని స్థాపించారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్లో మాత్రమే కాస్త బలంగా ఉంది ఈ పార్టీ. ఇతర రాష్ట్రాల్లో అడపాదడపా పోటీ చేస్తూ ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ పార్టీ సింబల్ కు చాలా క్రేజీ ఉంది. కేవలం సింబల్ కోసమే ఇండిపెండెంట్ అంతా ఈ పార్టీ బీఫారం కోసం పోటీ పడతారు. గతంలో చాలామంది ప్రముఖులు కూడా ఈ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో అయితే ఈ గుర్తుకు ఉన్న డిమాండ్ అంతా కాదు. 2018లో ఈ గుర్తుపై తెలంగాణలో 48 మంది పోటీ చేశారు. ఎన్నికల్లో అది 100 వరకు వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

AIFB Party
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..