CM KCR: కోదాడలో కదం తొక్కిన గులాబీ శ్రేణులు.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ..
Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడు పెంచారు. అభ్యర్థులను కూడా ముందే ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసిన కేసీఆర్.. రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. దసరా తర్వాత గులాబీబాస్ రెండు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడు పెంచారు. అభ్యర్థులను కూడా ముందే ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసిన కేసీఆర్.. రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. దసరా తర్వాత గులాబీబాస్ రెండు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ముందుగా కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..