కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే.. డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే.. డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు

Janardhan Veluru

|

Updated on: Oct 29, 2023 | 2:00 PM

హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లో నియోజక వర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నిన్నటి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రసంగంపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. కరెంట్‌ కోతలతో కర్నాటక చీకటి రాజ్యంలా మారిందన్నారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నామనడం సిగ్గుచేటన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పుచేశామని ఆ రాష్ట్ర రైతులు బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లో నియోజక వర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నిన్నటి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రసంగంపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. కరెంట్‌ కోతలతో కర్నాటక చీకటి రాజ్యంలా మారిందన్నారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నామనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ అంధకారం తథ్యమన్నారు. స్వయంగా కర్ణాటక రైతులు తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాలకు వచ్చి అక్కడి కరెంట్ కష్టాలపై ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేయొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లుగా చేసిన అభివృద్ధి, పనులు చూసి ఓటేయాని కోరారు.

2014కు ముందు నీళ్లు, కరెంట్ కోసం ఇబ్బందులు పడ్డామని.. అప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కి ఓటేస్తే తెలంగాణ ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అక్కడ అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కర్ణాటకలో కమీషన్ల కుంభమేళాకు తెర తీశారని ధ్వజమెత్తారు.