Watch Video: ఎన్నికల ప్రచార సిత్రాలు.. మంత్రి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ చూశారా..?

Watch Video: ఎన్నికల ప్రచార సిత్రాలు.. మంత్రి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ చూశారా..?

Janardhan Veluru

|

Updated on: Oct 29, 2023 | 1:38 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లుపడుతున్నారు. మంత్రి మల్లా రెడ్డి కూడా తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లో ఆయన ప్రచారం సందడిగా  సాగింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో నెల రోజులే ఉన్నాయి. ఒకే విడతలో నవంబరు 30న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. నవంబరు 28వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. దీంతో అన్ని పార్టీల శ్రేణులు ప్రచారపర్వంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లుపడుతున్నారు. మంత్రి మల్లా రెడ్డి కూడా తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లో ఆయన ప్రచారం సందడిగా  సాగింది. పార్టీ కార్యకర్తలతో కలిసి మల్లారెడ్డి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. మరి మల్లారెడ్డి డ్యాన్స్‌ను మీరు కూడా పైన వీడియోలో చూసేయండి.

Published on: Oct 29, 2023 01:29 PM