Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడు అనుమానాస్పద మృతి.. సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే..

ఓ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో స్థానికంగా నివాసం ఉంటోన్న ఓ యువకుడు అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించాడు. మృతుడి జేబులో దొరికిని సూసైడ్‌ నోట్‌లో తన చావుకు ఎమ్మెల్యేతోపాటు, అతని అత్తమామలు కారణం అంటూ పూర్తిగా వివరాలు పొందుపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూసైడ్‌ నోట్‌ ప్రకారం ప్రాథమికంగా..

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడు అనుమానాస్పద మృతి.. సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే..
Man found hanging at his house in Junagadh
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 30, 2023 | 10:47 AM

జునాగఢ్‌, అక్టోబర్ 30: ఓ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో స్థానికంగా నివాసం ఉంటోన్న ఓ యువకుడు అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించాడు. మృతుడి జేబులో దొరికిని సూసైడ్‌ నోట్‌లో తన చావుకు ఎమ్మెల్యేతోపాటు, అతని అత్తమామలు కారణం అంటూ పూర్తిగా వివరాలు పొందుపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూసైడ్‌ నోట్‌ ప్రకారం ప్రాథమికంగా ఆత్మహత్య కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టించింది. అసలేం జరిగిందంటే..

గుజరాత్‌ రాష్ట్రం జునాగఢ్‌ జిల్లా చార్వాడ్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విమల్‌ చుదాసామా ఇంట్లో 28 ఏళ్ల వ్యక్తి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అనుమాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే విమల్‌తోపాటు అతడి అత్త, మామ వేధింపులే కారణం అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. మృతుడిని నితిన్‌ పర్మర్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైకప్పుకు ఉరి వేసుకొని చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు నితిన్‌ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువు కావడం గమనార్హం.

అయితే ఎమ్మెల్యే విమల్‌ మారోలా చెప్పుకొచ్చాడు. నితిన్‌ను ఎవరో హత్య చేసి, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని పోలీసులకు తెలిపాడు. అందుకు ఆధారంగా నకిళీ సూసైడ్‌ నోట్‌ను సృష్టించారని ఆయన ఆరోపించారు. పోలీసులు పర్మార్ ఇంట్లో లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎమ్మెల్యే మామ, అత్త పేర్లతోపాటు ఎమ్మెల్యే విమల్ చుడాసమాతో సహా మొత్తం ముగ్గురు పేర్లను పేర్కొన్నారు. మృతుడు సూసైడ్ నోట్‌లో నా పేరు చెప్పాడు. సదరు వ్యక్తి గత రెండేళ్లుగా నాతో మాట్లాడటం లేదు. అతను వరుసకు అత్త కొడుకు. అతని శరీరంపై ఉన్న గాయాల గుర్తులను చూస్తుంటే.. ఎవరో హత్య చేసి ఉంటాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సూసైడ్ నోట్‌లో ఉన్న చేతి రాత మృతుడు నితిన్‌కు సంబంధించింది కాదు. ఇది నా ప్రత్యర్ధులు నా పరువు తీసేందుకు పన్నిన కుట్ర’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్‌ మారోలా మీడియాకు తెలిపారు. ప్రాథమికంగా ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నామని, అతని మరణానికి గత ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని. సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ దర్యాప్తులో ఉంది అని పోలీసు ఇన్‌స్పెక్టర్ KM గాధ్వి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.