AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Hands-free Wheelchair: కాళ్లు పనిచేయకున్నా నడుస్తున్న అనుభూతి.. వికలాంగుల కోసం ‘హోండా’ సరికొత్త వీల్ చైర్

ఇప్పుడు వీటన్నింటినీ దాటుకొని అత్యుత్తమ టెక్నాలజీతో హోండా కంపెనీ మరో వీల్ చైర్ ను తయారు చేసింది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో హోండా టాప్ ఫైవ్ కంపెనీలో ఒకటి. హోండా టూ వీలర్స్, హోండా కార్లు అందరికీ తెలిసిందే. మొదటిసారిగా హోండా చాలా పరిశోధన చేసి వికలాంగుల కోసం ఒక హోండా యూని వన్ పేరుతో దీన్ని తయారు చేసింది. యూని వన్ కేవలం నడవలేని వాళ్లకు మాత్రమే కాదు. నడుము కదిలించలేని వాళ్ళకి, వెన్నుముక విరిగిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది. మామూలు వీల్ చైర్లులాకాకుండా..

Honda Hands-free Wheelchair: కాళ్లు పనిచేయకున్నా నడుస్తున్న అనుభూతి.. వికలాంగుల కోసం 'హోండా' సరికొత్త వీల్ చైర్
UNI-ONE wheelchair
Rakesh Reddy Ch
| Edited By: Srilakshmi C|

Updated on: Oct 31, 2023 | 11:34 AM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31: ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన, పుట్టుకనుంచే ఏదైనా అంగవైకల్యం ఉన్న అలాంటి వాళ్లకు వీల్ చైర్ తప్పనిసరి. మొదట్లో ఒక మనిషి సహాయంతోనే వీల్ చైర్ లో కదిలే అవకాశం ఉండేది. ఆ తర్వాత రోజుల్లో సొంతంగా మాన్యువల్ గా కదిలించుకునే స్థితి నుంచి ఇప్పుడు బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్ లు వచ్చాయి. ఆల్మోస్ట్ ఎవరి సహాయం లేకుండానే ఎక్కడికైనా వెళ్లగలిగేలా ఈ వీల్ చైర్లను తయారు చేస్తున్నారు.

ఇప్పుడు వీటన్నింటినీ దాటుకొని అత్యుత్తమ టెక్నాలజీతో హోండా కంపెనీ మరో వీల్ చైర్ ను తయారు చేసింది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో హోండా టాప్ ఫైవ్ కంపెనీలో ఒకటి. హోండా టూ వీలర్స్, హోండా కార్లు అందరికీ తెలిసిందే. మొదటిసారిగా హోండా చాలా పరిశోధన చేసి వికలాంగుల కోసం ఒక హోండా యూని వన్ పేరుతో దీన్ని తయారు చేసింది. యూని వన్ కేవలం నడవలేని వాళ్లకు మాత్రమే కాదు. నడుము కదిలించలేని వాళ్ళకి, వెన్నుముక విరిగిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది. మామూలు వీల్ చైర్లులాకాకుండా యూని వన్ లో హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ వీల్ చైర్ లో వెళ్తున్న సాధారణ మనిషి నడుస్తుంటే ఎలా ఉంటారో అలాంటి సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు దీని ఆపరేటింగ్ అంతా వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి కనుసైగలను బట్టి ఉంటుంది. బాడీ మూమెంట్ ద్వారా కూడా యూని వన్ లో ఎటు పక్కకు కావాలంటే ఎటు పక్కకు ప్రయాణం చేయవచ్చు. చేతులను స్వేచ్ఛగా కదిలించే విధంగా వీల్ చైర్ కు ఎలాంటి మన్యువల్ ఆపరేటింగ్ సిస్టం ఇవ్వలేదు. ఇది పూర్తిగా బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్. ఒక్కసారి చాట్ చేస్తే కొన్ని రోజులపాటు వీల్ చైర్ పనిచేస్తుంది. నాలుగు చక్రాలను యూని వన్ కు బిగించారు. ఇది పూర్తిగా హట్ డ్రైవ్ సిస్టం ద్వారా పనిచేస్తాయి. ఈ చక్రాలు ఎక్కడ బయటకు కనిపించవు.

ఇవి కూడా చదవండి

వృద్ధులు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా అవసరమైతే దీనికి ఒక జాయ్ స్టిక్ ని కూడా అమర్చుకునే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏర్పాటు చేసింది. ఈ యూనివన్ సహాయంతో వ్యక్తులు సాధారణ మనుషులు చేసే ఉద్యోగాలు కూడా చేయొచ్చని చెప్తుంది హోండా కంపెనీ. హోటల్లో సర్వీస్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో పనిచేయడం, గేమ్స్ ఆడుకోవడం, ఇంకా కొన్ని ఇండోర్ జాబ్స్ చేసుకోవచ్చని చెప్తుంది. ముగ్గురు ఇంజనీర్ల ప్రయత్నమే ఈ యూనివన్. త్వరలోనే ఈ హైటెక్నాలజీ వీల్ చైర్ ని మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు హోండా.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.