AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: స్మార్ట్ ఫోన్ హంగులతో జియో కొత్త ఫీచర్ ఫోన్.. కేవలం రూ. 2,599కే..

ఇప్పటికే జియో నుంచి ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కాగా మరో కొత్త బేసిక్ మోడల్ ఫీచర్ ఫోన్లు మరింత అదనపు హంగులను జోడించి ఆవిష్కరించింది. ఈ కొత్త ఫోన్ పేరు జియో ఫోన్ ప్రైమా 4జీ. కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (ఐఎంసీ)లో ప్రదర్శించింది. దీపావళి నాటికి దీనిని అందరికీ అందుబాటులో తెస్తామని ప్రకటించింది.

Reliance Jio: స్మార్ట్ ఫోన్ హంగులతో జియో కొత్త ఫీచర్ ఫోన్.. కేవలం రూ. 2,599కే..
Jiophone Prima 4g
Follow us
Madhu

|

Updated on: Oct 30, 2023 | 4:00 PM

రిలయన్స్ జియో.. అందిరికీ తెలిసిన పేరు. టెలికాం రంగంలో ఓ సెన్సేషన్. ఇంటర్ నెట్ ను ప్రతి ఇంట్లోకి తీసుకొచ్చిన సంస్థ. చవకైన ధరలకు పెట్టింది పేరు. ఇప్పటికే జియో నుంచి ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కాగా మరో కొత్త బేసిక్ మోడల్ ఫీచర్ ఫోన్లు మరింత అదనపు హంగులను జోడించి ఆవిష్కరించింది. ఈ కొత్త ఫోన్ పేరు జియో ఫోన్ ప్రైమా 4జీ. కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (ఐఎంసీ)లో ప్రదర్శించింది. దీపావళి నాటికి దీనిని అందరికీ అందుబాటులో తెస్తామని ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు జియోమార్ట్ వెబ్ సైట్లో ఉంచింది. జియో ఫోన్ ప్రైమా 4జీ ప్రీమియం డిజైన్‌తో కూడిన ఫీచర్ ఫోన్. దీనిలో వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు పనిచేస్తాయి.

జియో ప్రైమా 4జీ ఫోన్ స్పెసిఫికేషన్లు..

కొత్తగా విడుదల చేసిన జియో ఫోన్ ప్రైమా 4జీ 320×240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 2.4-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. నుక ప్యానెల్‌ మీద రెండు సర్కిల్స్ ఉన్నాయి. అందులో జియో లోగోను ఉంచారు. ఈ ఫోన్‌లో 0.3-మెగాపిక్సెల్ కెమెరాతో వెనుకవైపు ఫ్లాష్‌లైట్ ఉన్నాయి. ఈ జియో ఫోన్ 512ఎంబీ ర్యామ్‌తో శక్తిని పొందుతుంది. మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించి నిల్వ సామర్థ్యాన్ని128జీబీ వరకు విస్తరించవచ్చు. కైఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఏఆర్ఎం కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.

కనెక్టివిటీ కోసం 4జీ బ్లూటూత్ 5.0ని కలిగి ఉంటుంది. 1800ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఎఫ్ఎం రేడియో ఫీచర్‌తో వస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన స్టేషన్‌లను ఆస్వాదించడానికి అనువైనదిగా ఉంటుంది. ఈ ఫోన్ యూట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ వంటి ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లతో కూడా వస్తుంది. వాట్సాప్, జియోచాట్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా యాప్‌లను కూడా ఇందులో పొందవచ్చు. ఇంకా, సవరించిన కార్యాచరణ కోసం వినియోగదారులు సినిమా, జియో పే యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ కు సంబంధించి జియో కంపెనీ ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది. ఈ ఫోన్ 23 భాషలకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

జియో ప్రైమా 4జీ ఫోన్ ధర, లభ్యత..

ఈకొత్త జియో ప్రైమా 4జీని దీపావళికి అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ముఖేష్ అంబానీ నేతృత్యంలోని రిలయన్స్ జియో ప్రకటించింది. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలతో పాటు ప్రధాన పట్టణాల్లోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఫోన్ జియోమార్ట్ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంపై ఇప్పటికే లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ దర రూ. 2599కాగా.. లాంచింగ్ సందర్భంగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్లు అందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..