AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ulefone armor 24: ఇలాంటి ఫోన్‌ను మునుపెన్నడూ చూసుండరు.. ప్రత్యేకతలు తెలిస్తే..

ఇక ఈ మధ్య కాలంలో బ్యాటరీకి పెద్ద పీట వేస్తూ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే వావ్‌ అనాల్సిందే. Ulefone ఆర్మర్‌ అనే పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. రఫ్‌ లుక్‌లో అత్యంత ధృడమైన బాడీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌లో ఏకంగా 22000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు...

Ulefone armor 24: ఇలాంటి ఫోన్‌ను మునుపెన్నడూ చూసుండరు.. ప్రత్యేకతలు తెలిస్తే..
Ulefone Armor 24
Narender Vaitla
|

Updated on: Oct 30, 2023 | 2:37 PM

Share

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్స్‌ తయారీలోనూ మార్పులు వచ్చాయి. యూజర్ల అవసరాలను అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఒక్కో ఫోన్‌ ఒక్కో ప్రాధాన్యతతో తీసుకొస్తున్నారు. కొన్ని ఫోన్స్‌లో కెమెరా ప్రాధాన్యత ఉంటే మరికొన్ని ఫోన్‌లలో స్క్రీన్‌లకు పెద్ద పీట వేస్తున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో బ్యాటరీకి పెద్ద పీట వేస్తూ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే వావ్‌ అనాల్సిందే. Ulefone ఆర్మర్‌ అనే పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. రఫ్‌ లుక్‌లో అత్యంత ధృడమైన బాడీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌లో ఏకంగా 22000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సాధారణ ఫోన్‌లతో పోల్చితే ఇది ఏకంగా 400 శాతం పెద్దది కావడం విశేషం. ఇక ఈ ఫోన్‌లో అందించిన ఎమర్జెన్సీ లైట్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఫోన్‌కి వెనకాల ఉన్న ఈ ఎల్‌ఈడీ లైట్‌ ఏకంగా 1000 లుమెన్స్ కాంతిని విడుదల చేస్తుంది. సాధారణంగా 10 వాట్స్‌తో పనిచేసే ఒక ఎల్‌ఈడీ బల్బ్‌ 900 లూమెన్ లైట్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఈ లెక్కన ఈ ఫోన్‌లో ఉన్న లైట్ ఏకంగా 10 వాట్స్‌ కంటే ఎక్కువ సమానమైన బల్బులా వెలుగుతుంది. ఈ లైట్‌ను ఆపరేట్‌ చేయడానికి ప్రత్యేకంగా ఓ బల్బ్‌ను అందించారు.

ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 66 వాట్స్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 7 రోజుల పాటు పనిచేస్తుంది. అంతేకాదండోయ్‌ ఈ ఫోన్‌ను పవర్‌ బ్యాంక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ ద్వారా రివర్స్‌ ఛార్జింగ్‌లో 10 వాట్స్‌ పవర్‌ అందిస్తుంది. ఇక ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందంచారు.

గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. నైట్ వీజన్‌ ఫీచర్‌ ఈ ఫోన్‌ సొంతం. అయితే ధర విషయంపై కంపెనీ ఇంకా ఇలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే అమ్మకానికి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌