Social Media: మీ డేటా భద్రం కానే కాదు.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు..

ముఖ్యంగా సోషల్‌ మీడియా సైట్స్‌లో మీరు పోస్ట్‌ చేస్తున్న ప్రతీ అంశాన్ని, మీ ఇష్టాయిష్టాలను అంచన వేస్తున్నారు. ది మనీ మాంగర్స్‌ అనే నివేదిక వెల్లడించిన విషయాల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సోషల్‌ మీడియా సైట్స్‌ తమ యూజర్ల డేటాను థార్డ్‌ పార్టీలతో పంచుకుంటున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం ఫేస్‌బుక్‌, థ్రెడ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజర్‌ వంటి యాప్స్‌ ద్వారా యూజర్ల వ్యక్తిగత...

Social Media: మీ డేటా భద్రం కానే కాదు.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు..
Social Media Data
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 30, 2023 | 12:40 PM

మీరు యూట్యూబ్‌లో ఓ వీడియో చూస్తుంటారు. సడన్‌గా ఓ యాడ్ వస్తుంది.. ఆసక్తికరమైన విషయం ఏంటంటే. సదరు యాడ్‌కు సంబంధించి మీరు అప్పటికే గూగుల్‌లోనో, లేదా ఫేస్‌బుక్‌లోనో సెర్చ్‌ చేసి ఉంటారు. ఇంతకీ ఆ సెలక్ట్‌డ్‌ యాడ్‌ ఎలా డిస్‌ప్లే అవుతుందనేగా మీ సందేహం. దీని వెనకాల డేటా సైన్స్‌ ఉంది. అంటే మీరు స్మార్ట్ ఫోన్‌లో చేస్తున్న ప్రతీ పని, వెతుకుతోన్న ప్రతీ అంశాన్ని ఎవరో మానిటరింగ్ చేస్తున్నారు.

ముఖ్యంగా సోషల్‌ మీడియా సైట్స్‌లో మీరు పోస్ట్‌ చేస్తున్న ప్రతీ అంశాన్ని, మీ ఇష్టాయిష్టాలను అంచన వేస్తున్నారు. ది మనీ మాంగర్స్‌ అనే నివేదిక వెల్లడించిన విషయాల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సోషల్‌ మీడియా సైట్స్‌ తమ యూజర్ల డేటాను థార్డ్‌ పార్టీలతో పంచుకుంటున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం ఫేస్‌బుక్‌, థ్రెడ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజర్‌ వంటి యాప్స్‌ ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను థార్డ్ పార్టీ యాప్‌లతో షేర్‌ చేసుకుంటున్నట్లు తేలింది. ఇందులో భాగంగా యాపిల్‌ స్టోర్‌ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన 100 యాప్‌లపై మనీ మోంగర్స్ అధ్యయనం నిర్వహించింది.

ఈ నివేదిక ప్రకారం.. థ్రెడ్ యాప్‌ ట్విట్టర్‌ కంటే 72 శాతం ఎక్కువ పర్సనల్ డేటాను సేకరిస్తుంది. థ్రెడ్‌లు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్. లింక్డ్‌ఇన్‌తో సహా అత్యధిక యూజర్ డేటాను సేకరిస్తున్న 5 యాప్‌లను కూడా అధ్యయనంలో తేలింది. ఈ యాప్‌లన్నీ థర్డ్ పార్టీలతో 82% డేటాను షేర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మెటా థ్రెడ్స్‌ యాప్‌ను ఈ ఏడాది జులైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోనే ఈ యాప్‌ ఏకంగా 100 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ జరిగాయి.

యూజర్‌ బేస్‌ 80 శాతానికి చేరుకుంది. ఈ అధ్యయనం ప్రకారం ప్రతీ 10 యాప్స్‌లో 7 యాప్స్‌ యూజర్ల డేటాను సేకరిస్తున్నాయి. కొన్ని యాప్స్‌ 51 శాతం యూజర్‌ డేటాను థర్డ్‌ పార్టీలతో షేర్ చేసుకుంటుండగా, 72 శాతం డేటాను తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది. ఇక 64 శాతం యాప్‌లు కాంటాక్ట్ నెంబర్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తుననట్లు గుర్తించారు. ఇక యాప్‌లు యూజర్ల డేటాను ఎలా సేకరిస్తున్నాయన్న దానిపై కూడా మనీ మాంగర్స్‌ సంస్థ నివేధించింది. ఐఫోన్‌ డెవలపర్లు ప్రాథమికంగా థర్డ్‌ పార్టీ యాడ్స్‌, మార్కెటింగ్‌తో సహా రెండు ఫార్మాట్‌లలో డేటాను సేకరిస్తారు. యూజర్ల ప్లేస్‌, కంటెంట్, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌తో సహా ఆర్థిక సమాచారాన్ని కూడా సోషల్‌ మీడియా సైట్స్‌ సేకరిస్తున్నట్లు చెబుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!